Brahmacharis : పెళ్లి కోసం కర్ణాటక యువ రైతుల పాదయాత్ర
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకునేవారికి పిల్లలను ఇవ్వాలంటే తల్లిదండ్రులు నచ్చడం లేదు. దీంతో కర్ణాటకలోని గ్రామీణ యువ రైతులు పాదయాత్రగా పుణ్యక్షేత్రానికి వేళ్లేందుకు సిద్దమయ్యారు
కర్ణాటక(Karnataka)లోని గ్రామీణ యువ రైతులను వధువుల కొరత వేధిస్తోంది. కట్నం అడకపోయినా వారితో యువతుల పెళ్తికి పేరెంట్స్ ఆసక్తి చూపడం లేదు.వివాహా సంబంధాల (Marital relations) విషయంలో అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలని పెద్దలు చెబుతారు. ముఖ్యంగా ఆడపిల్లను ఇచ్చే కుటుంబాల పుట్టుపూర్వోత్తరాల గురించి ఆరా తీస్తారు. అమ్మాయిల ఈ విషయంలో తక్కువేమీ కాదు. అబ్బాయి అందగాడే కాదు లక్షల్లో జీతంతో మంచి ఉద్యోగం చేస్తూ.. అత్తమామలకు దూరంగా నగరాల్లో.. కుదిరితే విదేశాల్లో ఉంటే మరీ మంచిందని తమ గొంతెమ్మ కోర్కెలు కోరుతారు.
మాండ్య జిల్లాకు చెందిన పలువురు బ్రహ్మచారులు (Brahmacharis) వచ్చే నెలలో పాదయాత్రగా పుణ్యక్షేత్రానికి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సమస్యపై సమాజంలో అవగాహన కల్పించేందుకే పాదయాత్ర చేస్తున్నట్లు రైతులు వెల్లడించారు. గ్రామాల్లో నివసిస్తున్న రైతులకు తమ కుమార్తెలను ఇచ్చి పెళ్లిళ్లు (Weddings) చేయడానికి తల్లిదండ్రులు ఇష్టపడటం లేదు. అమ్మాయిలు కూడా అబ్బాయి వ్యవసాయం చేస్తున్నాడంటే ఆసక్తిని చూపించడం లేదు. చాలా మంది మహిళలు, వారి కుటుంబాలు గ్రామీణ జీవనంలోకి ప్రవేశించడానికి ఇష్టపడకపోవడమే ‘వధువుల (Brides) కొరత’కు కారణమైందని రైతులు అంటున్నారు.ప్రస్తుత సమాజంలో అమ్మాయిల కొరత గురించి అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని అఖిల కర్ణాటక బ్రహ్మచారుల సంఘం తెలిపింది.