»Keerthy Suresh Came To The Industry And Started His Career With Geetanjali Movie
Keerthy Suresh ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం..గీతాంజలి మూవీతో కెరీర్ స్టార్ట్
కీర్తి సురేష్ అనే పేరు వినగానే అందరికీ ‘మహానటి’ సినిమా గుర్తొస్తుంది. ఈ మహానటి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అప్పుడే పదేళ్లు అయ్యింది. చిన్నప్పటి నుంచే ఆర్టిస్ట్ అయిన కీర్తి మలయాళ సినిమా ‘గీతాంజలి’తో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది
కీర్తి సురేష్ ఈ ఏడాది దసరాతో హిట్టందుకున్న కీర్తి సురేశ్(Keerthi Suresh) వరుస సినిమాలతో బిజీగా ఉంది. మహానటి మూవీ తరువాత లేడీ ఓరియంటెడ్ మూవీస్‌కి కరెక్ట్ సెట్ అయింది. మరో ప్రక్క స్టార్ హీరోల పక్కన నటిస్తూ కమర్షియల్ సినిమాలు చేస్తూనే, మరో పక్క ఫిమేల్ లీడింగ్ సినిమాలు కూడా చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఉన్నాయి. అంతేకాదు స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే సూపర్ స్టార్, మెగా స్టార్ వంటి హీరోలకు చెల్లి గాను నటిస్తుంది. గతంలో మహానటి (Mahanati) సావిత్రి ఇలా నటించేది. ఆ మహానటి బాటలోనే ఈ మహానటి కూడా పయనిస్తుంది.
తాజగా తమిళ్లోనూ ఉదయనిధి స్టాలిన్(Udayanidhi Stalin)తో నటించిన ‘మామన్నన్’ సక్సెస్ కీర్తికి మంచి బూస్ట్ ఇచ్చింది. ఇప్పుడు కోలీవుడ్‌లో వరుస పెట్టి నాలుగు సినిమాల్లో ఈ బ్యూటీ నటిస్తోంది. ప్రస్తుతానికి తెలుగులో మాత్రం మరో కొత్త ప్రాజెక్ట్‌ను కీర్తి ప్రకటించలేదు. ఇటీవల దీపావళి సందర్భంగా ఈ నటి పోస్ట్ చేసిన ఫొటోలు కొన్ని నెట్టింట వైరలవుతున్నాయి. లూజ్ హెయిర్‌లో బంగారు వర్ణం చీర కట్టులో దేవకన్యలో మెరిసిపోయింది. ఫ్యాన్స్‌కు పండగ శుభాకాంక్షలు చెప్తూ ఈ పోస్ట్ చేసింది. ఇక ఈ ఫొటోల్లో మునుపెన్నడూ లేనంత గ్లామరస్‌గా ఈ హీరోయిన్ కనపడుతోంది. ఈ ఏడాదిలో తెలుగులో నానితో నటించిన ‘దసరా’ భారీ వసూళ్లను రాబట్టింది. ఆ సినిమాలో డీ గ్లామర్ చేసిన కీర్తి సురేశ్, బారాత్ డాన్స్ బీట్తో మాస్ ఆడియన్స్‌తో హుషారెత్తించింది.
మహానటి ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం
కీర్తి సురేష్… 14 నవంబర్ 2013లో వచ్చిన మలయాళ సినిమా ‘గీతాంజలి(Gitanjali)’తో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి పదేళ్లు అవ్వడంతో #10YearsOfKeerthySuresh అనే ట్యాగ్ ని కీర్తి సురేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. కీర్తి సురేష్ ఫోటోలని, ఆమె నటించిన సూపర్ హిట్ సినిమాల గురించి ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. అందరిలాంటి మాములు హీరోయిన్ గా ఉన్న కీర్తి సురేష్ కెరీర్ ని టర్న్ చేసిన సినిమా మహానటి. ఈ సినిమా కీర్తిపై ప్రేక్షకుల్లో అంచనాలని పెంచింది అందుకే మహానటి తర్వాత కీర్తి సురేష్ నుంచి ఆడియన్స్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడం మొదలుపెట్టారు.
వరుస సినిమాలతో కీర్తి ఫుల్ బిజీ
కీర్తి సినిమాల విషయానికి వస్తే ఇటీవల ‘భోళా శంకర్’(Bhola Shankar)తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ‘భోళా శంకర్’ తెరకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘వేదాళం’ సినిమాకి రీమేక్ గా ‘భోళా శంకర్’ తెరకెక్కింది. ఇందులో చిరంజీవి (Chiranjeevi) సరసన తమన్నా భాటియా హీరోయిన్ గా నటించగా, కీర్తి సురేశ్, సుశాంత్ కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం కీర్తి ‘సైరెన్’, ‘రఘు తాత’, ‘రివాల్వర్ రీటా’, ‘కన్నివెడి’ అనే తమిళ సినిమాల్లో నటిస్తోంది.