Keerthy Suresh: కీర్తి భారీగా పెంచేసిందా? మరి అది కూడానా?
మహానటిగా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్.. చివరగా తెలుగులో 'భోళా శంకర్' సినిమాతో ఆడియెన్స్‌ని పలకరించింది. ప్రస్తుతం తమిళ్లో కొన్ని సినిమాలు చేస్తున్న కీర్తి.. నెక్స్ట్ బాలీవుడ్లో కూడా అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో భారీగా పెంచేసినట్టుగా తెలుస్తోంది.
Keerthy Suresh: ప్రస్తుతం తమిళ్, మళయాళ భాషల్లో కొన్ని సినిమాలు చేస్తోంది కీర్తి సురేష్. ఇక ఇప్పుడు బాలీవుడ్లో ఎంట్రి ఇచ్చేందుకు రెడీ అవుతోంది. వాస్తవానికి కీర్తి పాప 2019లోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాల్సింది. అజయ్ దేవగణ్ హీరోగా తెరకెక్కిన మైదాన్ సినిమాకు కీర్తి సురేష్‌ను హీరోయిన్గా అనుకున్నారు. కానీ సినిమా షూటింగ్ మొదలైన తర్వాత ఆమెను తప్పించారు. అప్పటి నుంచి కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ పోస్ట్‌పోన్ అవుతునే ఉంది. అయితే ఎట్టకేలకు ఫైనల్‌గా.. ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్‌కు అమ్మడు సై అనేసంది. వరుణ్ ధావన్ హీరోగా తేరీ రీమేక్‌తో తెరకెక్కుతున్న ‘బేబీ జాన్’ సినిమాతో హిందీలో అడుగుపెట్టబోతోంది.
అట్లీ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను కలీస్ దర్శకత్వం వహిస్తున్నాడు. సమ్మర్లో ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే కీర్తి సురేష్ ఈ సినిమాకు తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు వైరల్‌గా మారింది. బేబీ జాన్ మూవీ కోసం ఏకంగా 4 కోట్లు తీసుకుంటుందని సమాచారం. మామూలుగా అయితే.. కీర్తి సురేష్ పారితోషికం 2 కోట్లకు అటు ఇటుగా ఉంటుంది. కానీ హిందీ సినిమా కోసం 4 కోట్లు అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే.. రెమ్యూనరేషన్‌తో పాటు.. కీర్తి గ్లామర్ డోస్ కూడా మరింతగా పెంచుతుందా? అనేది మరింత హాట్ టాపిక్‌గా మారింది. సర్కారు వారి పాట సినిమాతో అందాల విందు చేస్తున్న కీర్తి.. బేబి జాన్ పారితోషికం చూస్తుంటే.. మామూలుగా ఉండదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.