సల్మాన్ ఖాన్ టైగర్ 3 మూవీ నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. నాసిక్‌లో ఓ థియేటర్లో పటాకులు కాల్చి రచ్చ రచ్చ చేశారు ఫ్యాన్స్. అలా చేయొద్దని అభిమానులను కోరారు సల్మాన్ ఖాన్.
Tiger3: సినీ నటులపై పిచ్చి అభిమానం ఉంటుంది కొందరికీ.. ఒక్కొక్కరు ఒకలా సెలబ్రేట్ చేస్తుంటారు. మూవీ రిలీజ్ అంటే చాలు తెగ హడావిడి ఉంటుంది. సల్మాన్ ఖాన్ టైగర్ 3 (Tiger3) మూవీ నిన్న ప్రపంచ వ్యాప్తంగా 9 వేల స్క్రీన్లలో విడుదలైంది. ఆ మూవీ హిట్ టాక్ అందుకుంది.
మహారాష్ట్ర నాసిక్‌లో ఓ థియేటర్లో ఫ్యాన్స్ రచ్చ చేశారు. అవును.. థియేటర్లో పటాకులు కాల్చారు. ఆ వీడియోలను షేర్ చేయడంతో చక్కర్లు కొడుతున్నాయి. ఫ్యాన్స్ సందడి ఏందో కానీ.. మూవీ చూసే వారు మాత్రం భయాందోళనకు గురయ్యారు. ఏదో ఖాళీ ప్లేస్ ఉంటేనో.. థియేటర్ ముందో అలా చేయలేదు. మధ్యలో.. జనం ఉండగా పటాకులు కాల్చారు. దీంతో మూవీ చూసేందుకు వచ్చే జనం ఇబ్బంది పడ్డారు.
థియేటర్లో బాణాసంచా
నిన్న రిలీజ్ అయిన సల్మాన్ ఖాన్ టైగర్ 3 మూవీ ప్రదర్శితమవుతున్న ఓ థియేటర్లో ఫ్యాన్స్ అత్యుత్సాహం చూపించారు.
ఏకంగా థియేటర్లోనే బాణసంచా పేల్చారు. దీంతో అక్కడున్న వారు భయభ్రాంతులకు గురయ్యారు. pic.twitter.com/zpGqt7MOvB
ఘటన గురించి తెలుసుకున్న సల్మాన్ ఆందోళన వ్యక్తం చేశారు. దయచేసి ఇలాంటివి చేయొద్దని వారికి కోరారు. ఇతరులను ప్రమాదంలోకి నెట్టకుండా.. హాయిగా సినిమా చూడాలని సూచించారు. సురక్షితంగా ఉండండి.. మిగతా వారిని ఉండనీయాలని పేర్కొన్నారు. సల్మాన్ సూచనతో అయినా ఫ్యాన్స్ ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉంటారో చూడాలి మరీ.