సలార్ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వినిపిస్తునే ఉంటుంది. లేటెస్ట్ టాక్ మాత్రం కాస్త షాకింగ్‌గానే ఉంది. అసలు ప్రభాస్ లేకుండా సాంగ్ ఉంటుందనే న్యూస్ వైరల్‌గా మారింది. మరి ప్రశాంత్ నీల్ ప్లాన్ ఏంటి?
Salaar: ఎట్టకేలకు.. సలార్ మేకర్స్ సాలిడ్ ట్రీట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీపావళికి కానుకగా డిసెంబర్ 1న సలార్ ట్రైలర్ రానుందని పవర్ ఫుల్ పోస్టర్‌తో అనౌన్స్ చేశారు. అందులో ప్రభాస్ గన్ ఫైరింగ్ చూసి.. ట్రైలర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. రాత్రి 7 గంటల 19 నిమిషాలకు డిజిటల్ రికార్డ్స్ అన్నీ చెల్లా చెదురు కానున్నాయి. అలాగే ఆరోజు నుంచే సలార్ ప్రమోషన్స్ స్టార్ట్ కానున్నాయి. మూడు వారాల పాటు సలార్ ప్రమోషన్స్ జరగనున్నాయి. డిసెంబర్ 22న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ థియేటర్లోకి రానుంది. ఇక ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో జరిగే రచ్చ అంతా ఇంతా కాదు.
సలార్‌లో రెండే రెండు సాంగ్స్ ఉంటాయని ముందు నుంచి ప్రచారంలో ఉంది. లాస్ట్ మినిట్‌లో ఐటెం సాంగ్ యాడ్ చేశారని.. రీసెంట్గా షూట్ కూడా చేశారనే టాక్ ఉంది. యంగ్ బ్యూటీ సిమ్రత్ కౌర్ ఈ సాంగ్‌లో చిందేసిందట. ఇప్పుడు ఈ సాంగ్ పై లేటెస్ట్ ట్విస్ట్ ఒకటి షాకింగ్‌గా మారింది. అసలు ఈ సాంగ్‌లో ప్రభాస్ కనిపించడట. ఈ సాంగ్ షూటింగ్ జరిగినప్పుడు విదేశాల్లో ఉన్నాడు ప్రభాస్. దీంతో.. ఐటెం సాంగ్‌లో ప్రభాస్ కనిపించే ఛాన్సెస్ తక్కువని అంటున్నారు. మరి సలార్ లేకుండా.. సాంగ్ ఎందుకు? అనేదే ఇప్పుడు అర్థం కాకుండా పోయింది. కానీ ప్రశాంత్ నీల్ అంత ఈజీగా సినిమాలో ఐటెం సాంగ్ పెట్టడు. ఖచ్చితంగా ఈ సాంగ్ సిట్యువేషన్ బలంగా ఉంటుందని అంటున్నారు. మరి సలార్ ఎలా ఉంటుందో చూడాలి.