Ravi Teja: హిట్ కాంబో రిపీట్.. అనిల్ రావిపూడి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే?
హిట్ కాంబోని రిపీట్ చేయడం మాస్ మహారాజ రవితేజకు అలవాటే. ఇప్పటికే చాలామంది డైరెక్టర్స్‌తో రిపీటేడ్గా వర్క్ చేసిన మాస్ రాజా.. ఇప్పుడు మరోసారి అనిల్ రావిపూడి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం.
Ravi Teja: దసరాకు టైగర్ నాగేశ్వర రావుగా ఆడియెన్స్ ముందుకొచ్చిన మాస్ మహారాజా రవితేజ.. ప్రస్తుతం ఈగల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అలాగే.. డాన్ శీను, బలుపు, క్రాక్ తర్వాత మరోసారి గోపిచంద్ మలినేనితో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాల తర్వాత మరోసారి మాస్ కాంబో రిపీట్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. సక్సెస్ ఫుల్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా రవితేజతోనే అని తెలుస్తోంది. రీసెంట్గా బాలయ్య ‘భగవంత్ కేసరి’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు అనిల్ రావిపూడి. అయితే.. ఇప్పటికే బాలయ్య ఎన్బీకె 109 షూటింగ్ మొదలు పెట్టేశాడు. కానీ అనిల్ ఇంకా తదుపరి ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు.
భగవంత్ ప్రమోషన్స్‌లో కూడా ఎక్కడా రివీల్ చేయలేదు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. మాస్ రాజాతో నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘రాజా ది గ్రేట్’ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో బ్లైండ్‌గా కనిపించి అదిరిపోయే ఎంటర్టైనింగ్ ఇచ్చాడు రవితేజ. దీంతో మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కానుందని సమాచారం. వచ్చే ఏడాదిలో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళే అవకాశం ఉందంటున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించనున్నట్టుగా తెలుస్తోంది. అయితే.. ఈ సినిమా రాజా ది గ్రేట్‌కి సీక్వెల్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారు. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని టాక్. మరి ఈసారి రవితేజ, అనిల్ రావిపూడి ఎలాంటి సబ్జెక్ట్‌తో వస్తారో చూడాలి.