BHNG: రఘునాధపురంలో రైతులకు నకిలీ విత్తనాలపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఆలేరు ఇన్ఛార్జ్ ఏడీఏ శ్రీనివాస్, SI వినయ్ కుమార్లు మాట్లాడుతూ.. రైతులు నకిలీ పత్తి విత్తనాలు నాటి నష్టపోవద్దని, అదేవిధంగా ప్రభుత్వం నిషేధించిన గ్లైపోసెట్ గడ్డి మందును ఎట్టి పరిస్థితిలో వాడొద్దని రైతులకు అవగాహన కల్పించారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే తమకు సమాచారం ఇవ్వాలన్నారు.