TG: ఇప్పచెట్టుకు 5వేల ఏళ్ల చరిత్ర ఉందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో విక్రయిస్తున్న చీప్ లిక్కర్ వల్ల ప్రజల ఆరోగ్యం పాడువుతోందని.. 60 ఏళ్లు కూడా బతకలేని పరిస్థితి నెలకొందని ఆనిరుధ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు గతంలో ఇప్ప పువ్వు సారా తాగి 100 ఏళ్లు బతికారని గుర్తుచేశారు. దీంతో ప్రభుత్వం ఇప్ప ఉత్పత్తులను ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు.