Adhurs: ఇప్పటి వరకు చాలా మంది హీరోల పాత సినిమాలు ప్రీ రిలీజ్ చేశారు. బ్లాక్ బస్టర్ అయిన చిత్రాలను రీ రిలీజ్ చేస్తున్నారు. కొన్ని ప్లాప్ అయిన మూవీలను కూడా విడుదల చేశారు. రీ రిలీజ్ లో సూపర్ బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ చేసిన అదుర్స్ (Adhurs) మూవీని కూడా రీ రిలీజ్ చేయనున్నారు. ప్రీ బుకింగ్స్ షురూ అయ్యాయి.
కామెడీ ఎంటర్టైనర్ నవంబర్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటినుంచే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. బుకింగ్స్ ప్రారంభ ట్రెండ్ అంత బాగా లేవు. RTC X రోడ్స్‌లో పెద్ద సెంటర్లలో కూడా పరిమిత బుకింగ్స్ కనిపిస్తున్నాయి. తక్కువ మంది మూవీ చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో విడుదలైన మెగా స్టార్ చిరంజీవి శంకర్ దాదా MBBS మెరుగైన బుకింగ్స్ వచ్చాయి. సినిమాతో పోలిస్తే అదుర్స్ పై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.
అదుర్స్పై ఆసక్తి లేకపోవడంతో రీరిలీజ్ మునుపటిలా మ్యాజిక్ సృష్టించలేవని భావన కలుగుతుంది. రీ-రిలీజ్ ప్రత్యేకమైన అనుభవంగా ఉండేవి.. ఇప్పుడు వాటి కొత్త దనం అరిగిపోయింది. అదుర్స్ కోసం అభిమానులు కూడా సంబరాలు చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
గతంలో ఎన్టీఆర్‌కి ఆది, సాంబ చిత్రాలకు దర్శకత్వం వహించిన వివి వినాయక్ అదుర్స్ మూవీని డైరెక్ట్ చేశాడు. ఆది భారీ బ్లాక్‌బస్టర్ కాగా, సాంబ మ్యాజిక్ క్రియేట్ చేయడంలో విఫలమైంది. అదుర్స్ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించింది. ఎన్టీఆర్, బ్రహ్మనందం కామెడీ ట్రాక్, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఘన విజయం సాధించింది.