»Fire In Two Places In Hyderabad Property Loss In Lakhs
Fire Accident : హైదరాబాద్లో రెండు చోట్ల అగ్నిప్రమాదం.. లక్షల్లో ఆస్తి నష్టం
అమీర్పేట్, పాతబస్తీల్లో ఈ తెల్లవారుజామున రెండు వేర్వేరు అగ్ని ప్రమాదాలు సంభవించాయి. అమీర్పేట్ పరిధిలోని మధురానగర్లోగల ఓ ఫర్నీచర్ గోదాంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్(Hyderabad)లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరిగాయి. అమీర్పేట్ పరిధిలో ఒక అగ్నిప్రమాదం చోటు చేసుకోగా.. పాతబస్తీ పరిధిలోని షాలిబండలో మరొకటి జరిగింది. అమీర్పేట(Ameerpet)పరిధిలోని మధురానగర్లో ఫర్నిచర్ గోదాంలో మంటలు ఎగసిపడటంతో.. ₹లక్షల విలువైన ఫర్నిచర్ దగ్ధమైనట్లు సమాచారం. షాలిబండ(Shalibanda)లో ప్రాంతంలోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ దుకాణంలో సైతం అగ్నిప్రమాదానికి భారీగా మంటలు ఎగసిపడ్డాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఈ రెండు ప్రమాదాలకుగల కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు దీపావళి పండుగ వేళ హైదరాబాద్లోని తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. దీపావళి సంబురాలు ఓ కుటుంబంలో విషాదాన్ని నింపాయి. మల్కాజిగిరి(Malkajigiri)పీవీఎన్ నగర్లోని వేంకటేశ్వర అపార్ట్మెంట్స్లో దీపావళి పండుగ సందర్భంగా ఓ మహిళా ఇంట్లో దీపాలు వెలిగిస్తోంది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ ఆమె చీరకు నిప్పు అంటుకుంది. ఇది గమనించిన మహిళా భర్త ఆమెను రక్షించేందుకు వెళ్లాడు. ఆమెను కాపాడే ప్రయత్నంలో మంటలు అంటుకుని భర్త మృతి చెందాడు. ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు మహిళను ఆసుపత్రికి తరలించారు.