»Another Fake Video Of Rashmika Mandana Goes Viral
Rashmika Mandana: రష్మిక మరో డీప్ ఫేక్ వీడియో..నెట్టింట్ వైరల్
నేడు టెక్నాలజీని చూసి ఆనందపడాలో భయపడాలో తెలియని పరిస్థితి వచ్చింది. ఏఐ టెక్నాలజీతో ఫేస్ మార్పింగ్ వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇది వరకే హీరోయిన్ రష్మికాకు చెందిన ఓ వీడియో వైరల్ కాగా దానిపై పలువురు సెలబ్రెటీలు స్పందించారు. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురిలో భయం మొదలైంది.
Rashmika Mandana: ఆకతాయిల ఆగడాలకు అంతుపొంతులేకుండా పోయింది. ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకుని స్టార్ హీరోయిన్ రష్మిక (Rashmika Mandanna)ను టార్గెట్ చేస్తున్నారు. ఇదివరకే ఈ కథానాయక మార్ఫింగ్ వీడియోను క్రియేట్ చేసి డీఫెమ్ చేయడానికి ప్రయత్నించారు. తాజాగా మరో వీడియో నెట్టింట్లొ దర్శనం ఇవ్వడంతో సెలబ్రెటీల అందరిలో భయం మొదలైంది. లేటెస్ట్ వీడియోలో రష్మిక జిమ్ సూట్ ధరించి సాంగ్‌పై డ్యాన్స్ చేస్తున్నట్లు ఉంది. ఇది కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఈ సారి ఈ వీడియో హీరోయిన్ అభిమానులే కాకుండా, నెటజన్లు కూడా స్పందిస్తున్నారు. ఇది ఫేక్ వీడియో దీన్ని ఎవరు నమ్మకండి, ఎక్కడ షేర్ చేయకండని అవగాహన కల్పిస్తున్నారు.
ఏఐ టెక్నాలజీని(AI) దుర్వినియోగం చేస్తూ కొంతమంది ఆకతాయిలు ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. తార జారా పటేల్ వీడియోకు రష్మిక ముఖాన్ని డీప్ ఫేక్ చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియో వైరల్ కావడంతో అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), కీర్తిసురేశ్, నాగచైతన్య, విజయ్ దేవరకొండలతో, కేటీఆర్(KTR) లాంటి రాజకీయ ప్రముఖులు కూడా స్పందించారు. ఇది చాలా ప్రమాదకరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి మార్పింగ్ చేసే వారిని కఠినంగా శిక్షించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సెలబ్రెటీలకు కుటుంబాలు ఉంటాయని మర్చిపోవద్దని హెచ్చరించారు. దీనిపై కేంద్ర ఐటీ శాఖ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మొదటి వీడియోపై రష్మిక స్పందిస్తూ..ఈ సాంకేతికతను చూస్తుంటే భయంగా ఉందన్నారు. తన గురించి మాత్రమే కాదని భవిష్యత్తులో ఇంకెంతో మంది హీరోయిన్లు, అమ్మాయిలు వీటికి బలవుతారోనని ఆందోళన వ్యక్తం చేశారు. తన ఫేక్ వీడియో వైరల్ అయినప్పుడు తనకు సపోర్ట్‌గా నిలిచిన తన ఫ్మామిలీ, ఫ్రెండ్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఆ ఘటన మర్చిపోక ముందే ఆమెకు సంబంధించిన మరో మార్ఫింగ్ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. ఇది కాస్తా వైరల్ కావడంతో ప్రధానంగా ఉన్న మరికొంత మంది హీరోయిన్లు కూడా భయాందోళన చెందుతున్నారు.