PPM: ఏపీ రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బొజ్జి రెడ్డి బుధవారం మన్యం జిల్లాలో పర్యటించనున్నట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్. ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఈ పర్యటనలో భాగంగా ఛైర్మన్ గిరిజన ప్రాంతాల అభివృద్ధి, భూ సంబంధిత సమస్యలు, విద్యా, సంక్షేమ కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తారని తెలిపారు.