SS: RDT సంస్థకు ఎఫ్సీఆర్ఏ అనుమతులు లభించిన సందర్భంగా బుధవారం మడకశిరలో భారీ కృతజ్ఞతా ర్యాలీ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ఎంఎస్. రాజు తెలిపారు. ఉదయం 10:30 గంటలకు వాల్మీకి సర్కిల్ ప్రారంభమై జ్యోతిబా పూలే సర్కిల్ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుందన్నారు. నియోజకవర్గ ప్రజలు, లబ్ధిదారులు, విద్యార్థులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.