»First List Of Cpm Candidates Released With 14 Candidates
CPM : 14 మందితో సీపీఎం అభ్యర్థుల తొలి జాబితా విడుదల
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్తో పొత్తు లేకుండా 14 మంది అభ్యర్థులతో సీపీఎం తొలి జాబితా విడుదల చేసింది
సీపీఎం (CPM) 14 మందితో ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్తో చివరివరకు పొత్తుకు ప్రయత్నించి విఫలమైన సీపీఎం తాజాగా తమ అభ్యర్థులతో పస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadra) ఖమ్మం జిల్లా పాలేరు నుంచి బరిలోకి దిగుతున్నారు.తమకు పట్టున్న 17 స్థానాల్లో పోటీకి దిగుతున్నట్టు ఇది వరకే ప్రకటించిన సీపీఎం 14 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. నేటి సాయంత్రం మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. నిన్న మెన్నటి వరకు కలిసి పోటీ చేయాలనుకున్న కాంగ్రెస్(Congress), సీపీఎం పార్టీల మధ్య పొత్తు చెడింది. సీట్ల కేటాయింపుపై ఇరుపార్టీల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో సీపీఎం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. తాము అడిగిన స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ విముఖత వ్యక్తం చేయడంతో వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది.