ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi), వరుణ్ తేజ్ పెళ్లి కోసం ఇటలీలో ఉన్నారు. నవంబర్ 2న పెళ్లి అయిపోయింది కాబట్టి.. తిరిగి హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కనున్నాడు. అలాగే..త్వరలోనే మెగా 156 సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్ లీక్ అయిపోయింది. అదేంటో ఇప్పుడు చుద్దాం.
భోళా శంకర్ తర్వాత భారీ సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi). ఇప్పటికే మెగా 156గా అనౌన్స్ ఈ ప్రాజెక్ట్‌ను.. బింబిసార డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమాకు.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. పంచభూతాలను కలుపుతూ సాగే ఒక ముల్లోక వీరుడు కథగా మెగా 156 తెరకెక్కబోతోంది. అందుకే.. ఈ సినిమాకు ఎప్పటినుంచో ముల్లోకవీరుడు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కానీ ఇప్పుడు మరో పవర్ ఫుల్ టైటిల్ లాక్ చేసినట్టుగా లీక్ అయిపోయింది.
ఈ సినిమా స్క్రిప్ట్‌కి సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. యూవీ క్రియేషన్స్ పేరుతో ఉన్న స్క్రిప్ట్ పేపర్ మొదటి పేజీలో ‘విశ్వంభర’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు రాసి ఉంది. దీంతో ఈ సినిమాకు విశ్వంభర(vishwambhara) అనే టైటిల్ లాక్ చేసినట్టుగా చెబుతున్నారు. అయితే ఇదే టైటిల్.. గతంలో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాకు కూడా వినిపించింది. కానీ ఆర్సీ 15కి గేమ్ చేంజర్ టైటిల్ ఫిక్స్ చేశాడు శంకర్. ఇక ఇప్పుడు మెగాస్టార్ సినిమాకు కూడా ఇదే టైటిల్ తెరపైకి రావడం విశేషం. కానీ దాదాపుగా.. మెగా 156కి ‘విశ్వంభర’ టైటిల్‌నే ఫిక్స్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇకపోతే.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ హీరోయిన్లను ఫైనలైజ్ చేసే పనిలో ఉంది. త్వరలోనే మెగా 156 టైటిల్‌తో పాటు హీరోయిన్ల విషయంలో క్లారిటీ రానుంది.