»Ram Gopal Varma React Vyuham Movie Stop Censorship
Ram gopal varma: ఎన్ని వ్యూహాలు పన్నినా మా ” వ్యూహం” నీ ఆపలేరు
ఆర్జీవీ వ్యూహం మూవీ నవంబర్ 10న విడుదల కావాల్సి ఉండగా..దానిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో అసలు వివాదం మొదలైంది. ఈ అంశంపై మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ బోర్డుకు లేఖ రాశామని దానిపై క్లారిటీ వచ్చిన తర్వాత మూవీ రిలీజ్ చేస్తామని వెల్లడించారు.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమా నవంబర్ 10 విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయలేదు. ఈ క్రమంలో పలు కారణాలతో ఈ చిత్రాన్ని రివ్యూ చేయడానికి దానిని రివిజన్ కమిటీకి పంపించారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై క్లారిటీ ఇచ్చేందుకు ఆర్జీవీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి గురువారం రాత్రి పలు విషయాలను వెల్లడించారు. వ్యూహం థియేటర్లలోనే విడుదల అవుతుందని ఆర్జీవీ హామీ ఇచ్చారు. ఏ ఇతర మీడియా ఛానెళ్లలో ఊహాగానాలు ప్రారంభించకముందే ఏమి జరుగుతుందో స్పష్టం చేయడానికి వచ్చానని ఆర్జీవీ అన్నారు. అయితే ఈ చిత్రం నవంబర్ 10న కాకుండా తర్వాత విడుదల చేస్తామని చెప్పారు. దీనిపై రివైజింగ్ కమిటీకి ఫిర్యాదు చేశామని ఆర్జీవి అన్నారు. కమిటీ నిర్ణయం తర్వాత విడుదల తేదీ ప్రకటిస్తామని అన్నారు. మరోవైపు వ్యూహం మూవీ విడుదల ఆపాలని నారా లోకేష్ సెన్సార్ బోర్డుకు లేఖ రాశారనే విషయం కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోందని ప్రస్తావించారు.
వ్యూహం మూవీ రాజకీయ వివాదాలను సృష్టించే విధంగా ఉందని సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చిత్రంలోని పాత్రలు నిజ జీవితంలోని వ్యక్తులు, వారి పేర్లను ప్రభావితం చేసే విధంగా ఉన్నాయని సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో రివైజింగ్ కమిటీకి వెళ్లాలని కోరింది. అయితే కమిటీ కూడా తమ చిత్రంపై అభ్యంతరం వ్యక్తం చేస్తే తాము కోర్టుకు వెళ్తామని ఆర్జీవీ అన్నారు.
ఇక ప్రస్తుతం ఉన్న సెన్సార్ బోర్డు అనేది కాలం చెల్లిన వ్యవస్థ అని రామ్‌గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. ఇది ఎప్పుడో వచ్చిందని, కానీ ఇప్పుడు స్మార్ట్ఫోన్లు, మీమ్‌లు ఉన్న కాలంలో ఎవరైనా ఏదైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేయవచ్చన్నారు. ఇలా అనేక మంది వారి అభిప్రాయాలు చెబుతున్నప్పుడు అపుతున్నారా అంటూ ప్రశ్నించారు. ఈ విధంగా అనేక మంది పలువురిపై తిడుతూ పోస్టులు చేస్తే సెన్సార్ బోర్డు అడ్డుకుంటుందా అని అడిగారు. వారికి లేని సర్టిఫికేషన్ సినిమాలకు మాత్రమే ఎందుకని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరు. ఎన్ని వ్యూహాలు పన్నినా మా ” వ్యూహం” నీ ఆపలేరని సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతోపాటు రివిజన్ కమిటీని పరిశీలించాల్సిందిగా సూచించిన సెన్సార్ లేఖను కూడా జతచేశారు.