పిల్లి- ఎలుక, కుక్క- పిల్లితో గొడవ కామన్. పెంపుడు జంతువుల మధ్య పొట్లాటను వీధిలో చూస్తుంటాం. మరి సింహాం, పులి లాంటి క్రూర మృగాలతో ఫైట్ ఎప్పుడైనా చూశారా అంటే లేదనే చెబుతారు. అవును వాటి జోలికి వెళ్లే ధైర్యం చేయవు. ఓ కుక్క మాత్రం పులితో గొడవకు దిగింది. నమ్మడం లేదా.. అయితే ఈ వీడియోను ఓ సారి చూడండి.
పులితో కుక్క గొడవ పడుతుంది. ఆ వీడియోలో సింహాం కూడా ఉంది. కొన్ని సెకన్లపాటు ఉన్న ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇన్ స్టాగ్రామ్ పేజీలో యానిమల్ పవర్ పేరుతో పోస్ట్ చేశారు. పులి చెవిని కొరికేందుకు కుక్క ప్రయత్నం చేస్తోంది. ఆ పక్కనే సింహాం కూడా ఉంది. గొడవలో తలదూర్చలేదు. కుక్క పులితో ఫైట్ చేస్తుండగానే.. సింహాంపై పులి గాండ్రించింది. అప్పుడు తనకెందుకులే అన్నట్టు సింహాం బయటకు వెళుతుంది. ఆ తర్వాత సింహం వెనకనుంచి వచ్చి పులిపై దాడి చేస్తోంది. దీంతో పులి దూకుతుంది. కుక్క మాత్రం పోరాటం చేస్తూనే ఉంది. ఈ వీడియో ‘జూ’లో జరిగింది. కొందరు సందర్శకులు నిలబడి ఉండటం మనం గమనించవచ్చు. వీడియో ‘డాగ్ వర్సెస్ టైగర్’ అనే క్యాప్షన్ పెట్టారు. వీడియోను షేర్ చేయగా లక్షలాది వ్యూస్ వచ్చాయి. 25 వేల లైకులు కొట్టారు. వీడియో చూసి నెటిజన్లు ఖంగుతిన్నారు.
అందులో ఏదో తప్పు ఉంది. ఆ పులి పులి కాదని ఓ యూజర్ రాశాడు. కొందరు డాగ్స్‌ను ఎందుకు పెంచుకుంటారో అర్థం కావడం లేదు. వీడియో చూస్తే సరిపోలడం లేదన్నారు. మరికొందరు ఇది సహాజం అని, అవి ఆడుకునే సమయంలో అలానే ఉంటాయని చెబుతున్నారు. వారు ఆడుతున్నారని మరొకరు రాశారు. ఆ కుక్క, సింహాం ఉండగానే దాడి చేసిందని మరొకరు అభిప్రాయపడ్డారు. ఆ కుక్క, పులి, సింహాంను పెంచిందని, ఇది అందమైన కథ అని మరొకరు కొట్టిపారేశారు. కొన్ని సెకన్లపాటు ఉన్న వీడియో మాత్రం భయపెట్టింది.