»Samsung New Phone Exchange With Old Phone Samsungs New Offer
Samsung: పాత ఫోన్‌తో కొత్త ఫోన్ ఎక్స్ఛేంజ్.. శామ్సంగ్ కొత్త ఆఫర్
పాత ఫోన్ ఉపయోగించే వాళ్లు 5జీ స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ కావాలనుకునే వాళ్లకు శామ్సంగ్ గుడ్ న్యూస్ చెప్పింది. 'అప్‌గ్రేడ్ టూ ఆసమ్'(Upgrade to Awsome) పేరుతో ఓ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది.
Samsung: పాత ఫోన్ ఉపయోగించే వాళ్లు 5జీ స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ కావాలనుకుంటే వాళ్లకు ఒక గుడ్ న్యూస్. శామ్సంగ్ కంపెనీ ‘అప్‌గ్రేడ్ టూ ఆసమ్'(Upgrade to Awsome) పేరుతో ఓ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఏ సిరీస్ 5జీ ఫోన్లపై పెద్ద ఎత్తున్న డిస్కౌంట్లు ఇస్తోంది. ఎలాంటి ఖర్చు లేకుండా శామ్సంగ్ కేర్ ప్రొటెక్షన్ ఫ్లస్ స్క్రీన్ ప్రొటెక్షన్ ప్యాక్ కూడా ఇస్తోంది. పాత శామ్సంగ్ యూజర్లు సులువుగా 5జీ స్మార్ట్ఫోన్లకు అప్‌గ్రేడ్ కావడం కోసమే ఈ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చినట్లు తెలిపింది. దీంతో పాటు వడ్డీ లేని ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.
2020 కంటే ముందున్న ఏ సిరీస్, జే సిరీస్ ఫోన్లను కొత్త ఫోన్లతో ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా గెలాక్సీ ఏ14 4జీబీ+64 జీబీ వేరియంట్ ధర రూ. 18,449 కాగా, దీనిని రూ.14,499కే ఇవ్వనున్నట్లు కంపెనీ పేర్కొంది. వీటికి రూ.973 నుంచి ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. శామ్సంగ్ గెలాక్సీ ఏ23 5జీ 6జీబీ+1280 జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ.28,990 ఉండగా రూ.18,999కే ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. దీనికి ఈఎంఐ ఆప్షన్ రూ.1407 నుంచి ప్రారంభం అవుతుందని తెలిపింది. శామ్సంగ్ ఏ సిరీస్‌లో ఏ34 8జీబీ+125జీబీ వేరియంట్ ధర రూ.35,499 ఉండగా.. దీనిని రూ. 25,999కే విక్రయించనున్నట్లు కంపెనీ తెలిపింది. శామ్సంగ్ ఏ54 5జీ 8జీబీ+128 జీబీ వేరియంట్ ధర రూ.41,999 ఉండగా.. అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్‌లో భాగంగా శామ్సంగ్ కస్టమర్లకు రూ.33,999కే విక్రయిస్తుంది. దీనికి రూ.1883 నుంచి ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఈ ఏ సిరీస్ ఫోన్లన్నీ ఆండ్రాయిడ్ 13తో పనిచేస్తాయి. 5000 mAh బ్యాటరీ కలిగి ఉన్నాయి.
2020 కంటే ముందున్న పాత శామ్సంగ్ ఫోన్లను అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్ ద్వారా మార్చుకోవచ్చు. అర్హులైన వారికి మై గెలాక్సీ యాప్‌లో కనిపిస్తుంది. దీని కోసం శామ్సంగ్ కస్టమర్లు పాత గెలాక్సీ ఫోన్లోని మై గెలాక్సీ యాప్‌లో కోడ్ జనరేట్ చేసుకోవాలి. ఫోన్ కొన్నాక కొత్త మొబైల్లో కోడ్ వివరాలు ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేయాలి. తర్వాత 48 గంటల్లో కస్టమర్ కేర్+ప్యాక్ యాక్టివేట్ అవుతుంది. ఈ స్క్రీన్ ప్రొటెక్షన్ ప్యాక్ ఆరు నెలల పాటు ఉచితంగా కంపెనీ అందిస్తోంది.