ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్స్ తీసుకొస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే మరోసారి ఆఫర్ల పండగ తీసుకొచ్చింది. ‘అమెజాన్ ప్రైమ్ డే’ సేల్ 2023ని తాజాగా ప్రకటించింది. కేవలం అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రమే భారీ డిస్కౌంట్ (Huge discount) ఉంటాయి. అక్టోబర్ 8 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Festival sale) ప్రారంభం కానుంది. టీవీలు, స్మార్ట్ఫోన్లు సహా అనేక వస్తువులపై ఆకర్షణీయ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 సేల్ (Amazon Great Indian Festival Sale) పేరిట ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ పండగ సేల్ (Amazon Festival Sale)కు సిద్ధమైంది. అక్టోబర్ 8 నుంచి సేల్‌ను ప్రారంభించనుంది. అయితే కొన్ని వస్తువులపై ఇప్పటికే ఆఫర్లను ప్రకటించింది. సేల్ కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన టీజర్ వెబ్సైట్లో వీటిని లైవ్‌లో ఉంచింది. ప్రస్తుతం టీవీలపై ఉన్న రాయితీలు, ఆఫర్లను సైట్ (Amazon Festival Sale TV Offers)లో అందుబాటులోకి తీసుకొచ్చింది. శాంసంగ్(Samsung), వన్‌ప్లస్, సోనీ, ఎల్జీ, షావోమీ కంపెనీల టీవీలపై ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించింది.
రెడ్మీ 43 అంగుళాల 4కే అల్ట్రా హెచ్డీ టీవీ ( Redmi 43-inch 4K Ultra HD TV) సేల్‌లో భాగంగా రూ.20,499కే లభించనుంది. దీని అసలు ధర రూ.42,999. అదనంగా రూ.5,500 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది.
వన్‌ప్లస్ టీవీ 43 వై1ఎస్ ప్రో ( OnePlus TV 43 Y1S Pro ) సేల్‌లో రూ.26,999కే అందుబాటులో ఉంది. దీని గరిష్ఠ చిల్లర ధర (MRP) రూ.39,999. ఈ ఆండ్రాయిడ్ ఎల్ఈడీ టీవీని నో-కాస్ట్ ఈఎంఐతో కొనుగోలు చేయొచ్చు.
ఎల్జీ 50 అంగుళాల 4కే అల్ట్రా హెచ్డీ టీవీ (LG’s 50-inch 4K Ultra HD TV) ఎంఆర్పీ రూ.60,990 కాగా సేల్‌లో ఇది రూ.40,990కి లభించనుంది. కూపన్ ఆధారిత డిస్కౌంట్ ద్వారా ఈ మోడల్‌పై మరో రూ.1,000ను కూడా అమెజాన్ తగ్గించనుంది.
55 అంగుళాల వీయూ మాస్టర్‌పీస్ Glo క్యూఎల్ఈడీ టీవీ (Vu 55-inch Masterpiece Glo QLED TV) తాజా సేల్‌లో రూ.62,999కు లభించనుంది. దీని ఎంఆర్పీ రూ.80 వేలు. కూపన్స్ ద్వారా మరో రూ.3,000 డిస్కౌంట్ కూడా ఉన్నట్లు అమెజాన్ వెబ్సైట్ ద్వారా తెలిపింది.
శాంసంగ్‌కు చెందిన క్రిస్టల్ 4కే ఐస్మార్ట్ యూహెచ్డీ టీవీ (Samsung’s Crystal 4K iSmart UHD TV) ఎంఆర్పీ రూ.52,900. అమెజాన్ పండగ సేల్‌లో ఇది రూ.32,990కే లభించనుంది. అదనంగా రూ.1,000 కూపన్ ఆధారిత డిస్కౌంట్ కూడా ఉంది.
ఏసర్ 50 అంగుళాల వీ సిరీస్ 4కే అల్ట్రా హెచ్డీ క్యూఎల్ఈడీ టీవీ (Acer’s 50-inch V Series 4K Ultra HD QLED TV) ధర రూ.59,999 కాగా సేల్‌లో రూ.32,499కి లభించనుంది.
సోనీ బ్రేవియా 4కే అల్ట్రా హెచ్డీ టీవీ (65-inch Sony Bravia 4K Ultra HD TV) సేల్‌లో భాగంగా రూ.82,990 తగ్గింపు ధర వద్ద అందుబాటులో ఉంది. దీని ఎంఆర్పీ రూ.1,39,900.
40 అంగుళాల టీసీఎల్ ఎస్ సిరీస్ టీవీ (TCL’s 40-inch S series TV) రూ.16,990కి లభించనుంది. దీని అసలు ధర రూ.40,990గా వెబ్సైట్ పేర్కొంది.
మరోవైపు అమెజాన్ సేల్ (Amazon)లో ఎస్బీఐ కార్డుపై అదనంగా 10 శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది. మరోవైపు కొన్ని టీవీలపై 60 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అయితే, అన్ని మోడల్ టీవీలపై మాత్రం రాయితీలు లేవు.