హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్శశాలలో జరుగుతున్న ప్రపంచ వన్డే వరల్డ్ కప్ 2023లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. చివరి వరకు పోరాడినా ఓటిమిపాలు అయింది.
Nz vs AUS: వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ – ఆస్ట్రేలియా (Nz vs AUS) జట్లు హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాల వేదికగా పోటీ పడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.2 ఓవర్లలో 388 పరుగులు చేసి ఆలౌటైంది. తరువాత బరిలో దిగిన న్యూజిల్యాండ్ చివరి వరకు పోరాడి 383 పరుగులు చేసి ఓటమిని అంగీకరించింది. ఆసీస్‌లో ట్రావిస్ హెడ్ 67 బంతుల్లో సెంచరీ బాదాడు, మొత్తం 109 పరుగులు చేశాడు. డేవిడ్ వార్నర్ 65 బంతుల్లో 81 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తానికి ఆసీస్ 388 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. తరువాత బ్యాటింగ్ చేసిన కివీస్ అద్భుతమైన ఆటను కనబరిచింది. రచిన్ రవింద్ర 89 బంతుల్లో 119 పరుగులు చేశాడు. మిచెల్, నీషెమ్ ఇద్దరు చెరో అర్థ సెంచరీ చేసినప్పటికీ వికెట్లు పడడంతో ఫలితం దక్కలేదు. ఆఖరి బంతి వరకు ఓటమిని ఒప్పుకోకుండా న్యూజిలాండ్ ప్రయత్నం చేసి అభిమానుల మనసును గెలిచింది. మరో వైపు కలకత్తా వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై నెదర్లాండ్ నిర్ణీత ఓవర్లలో 229 పరుగులు చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తోంది.