New zealand: వరల్డ్ కప్‌లో సంచలనాలు నమోదవుతున్నాయి. ఏ జట్టైనా సరే మినిమం 350, ఆపై రన్స్ చేస్తున్నారు. ఛేజింగ్ కూడా చేస్తున్నాయి. ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ (New zealand) మధ్య జరిగిన మ్యాచ్ కూడా అలాంటిదే. తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన వార్నర్, హెడ్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. 25 ఓవర్లలోపు ఆస్ట్రేలియా స్కోర్ బోర్డు 200 దాటింది. ఆ తర్వాత నెమ్మదించింది. మ్యాచ్‌లో కనీసం 430 పరుగులు అయినా చేస్తోందని క్రికెట్ విశ్లేషకులు భావించారు. 388 రన్స్‌కు ఆసీస్ బ్యాట్స్‌మెన్ పని పట్టారు కివీస్ బౌలర్లు. మ్యాచ్ గెలవాలంటే న్యూజిలాండ్ 389 రన్స్ చేయాల్సి ఉంది.
వార్నర్- హెడ్ జోడిని ఫిలిప్స్ దెబ్బతీశారు. 81 పరుగులు చేసి వార్నర్ వెనుదిరిగాడు. ఆ తర్వాత కాసేపటికే హెడ్ కూడా క్యూ కట్టారు. సెంచరీ చేసిన తర్వాత ఔటయ్యాడు. తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ ఏ ఒక్కరు కూడా ఆకట్టుకోలేదు. మార్ష్ 36, స్మిత్ 18, లాబుస్ 18, మాక్స్ వెల్ 41, జోష్ 38, కమ్మిన్స్ 37 పరుగులు చేశారు. స్టార్క్ సింగిల్ తీయగా.. జంపా, హజల్ వుడ్ ఖాతా తెరవలేదు. ఫిలిప్స్ 10 ఓవర్లు వేసి 3 కీలక వికెట్లు తీశాడు. కేవలం 37 పరుగులు మాత్రమే ఇచ్చాడు. బౌల్ట్ 10 ఓవర్లు వేసి 77 పరుగులు ఇచ్చినప్పటికీ 3 వికెట్లు తీశాడు. మిచెల్ 2, హెన్రీ, నిశం ఒక్కొ వికెట్ తీశారు.