Viral Video: అమ్మో.. వేడి నూనెలో పకోడి వేస్తూ చేతులు పెడుతున్నాడు
సోషల్ మీడియాలో రోజూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే తాజాగా ఓ వ్యక్తి వేడి నూనెలో పకోడీలు వేస్తూ చేతులు పెడుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Viral Video: వేడివేడి పకోడి తింటేనే నోరు కాలిపోతుంది. అలాంటిది సలసల కాగుతున్న వేడి నూనెలో చేతులు పెడితే ఇంకా ఉందా? తెలిసి తెలిసి అసలు ఎవరైనా వేడి నూనెలో చేతులు పెడతారా ? అలాంటి సాహసం కూడా ఎవరూ చేయరు. ఎందుకంటే నూనెలో చేతులు పెడితే కాలిపోతాయని తెలిసి చేతుల కాల్చుకోరు. కానీ సూరత్‌లో ఓ వ్యక్తి మాత్రం వేడి నూనెలో పకోడీలు వేస్తూ చేతులు పెడుతున్నాడు. అయిన అతని చేతులకు ఏం కాలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పకోడీలు వేస్తున్న ఓ వ్యక్తి ఆ మిశ్రమాన్ని అప్పుడే కలిపాడు. తర్వాత వేడి నూనెలో పకోడీలు వేస్తూ.. వాటిని చేతులతో పక్కకి నెట్టాడు. పకోడి ఊడికిందో లేదో తెలుసుకోవడానికి దానిని చేతితో తీసి చూశాడు. ఈ వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారుతోంది. కొంతమంది ఐరన్ మ్యాన్ అని.. మరికొందరు ఇది చాలా ప్రమాదకరం. ఇలా చేయడం కరెక్ట్ కాదని అన్నారు. దీనిని చూసి ఎవరైనా ఇలానే ట్రై చేస్తే కొందరు చేతులు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుందని అన్నారు. ఇంకొందరైతే వేడి నూనెలో చేతులు ఎలా ఉంచాడు? అని ఆశ్చర్యపోతున్నారు. కేవలం వీడియో వైరల్, వ్యూస్ కోసమే ఇంత ప్రమాదం అవసరమా అని కూడా అన్నారు.