PLD: పెదకూరపాడులోని పొడపాడులో భారీ దొంగతనం జరిగింది. మద్దికుంట్ల నాగమల్లిక కుటుంబ సభ్యులు వేరే ఊరికి వెళ్లగా, వ్యక్తులు ఇంటి తలుపులు పగలగొట్టి బీరువాలోని 204 గ్రాముల బంగారం, 69 తులాల వెండి, లక్ష రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై గిరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పగలు తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా పెట్టుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు.