W.G: ఆకివీడు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం రాత్రి రాష్ట్రస్థాయి ప్రతినిధులు ప్రశాంత్, నాగరాజులు సందర్శించారు. కాయకల్ప కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, ఓపీ, ప్రసూతి వార్డులను తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలు, భోజన వసతులపై ఆరా తీశారు. ఆసుపత్రి నిర్వహణ తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు.