Varun and Lavanya: పెళ్లి కోసం ఫ్లైట్ ఎక్కిన కొత్త జంట.. మెగా కోడలు మరిపోయిందా?
కొత్త జంట పెళ్లి పీటలెక్కె టైం వచ్చేసింది. నవంబర్ 1న ఇటలీలో గ్రాండ్‌గా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాటి డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. అందుకోసం.. నాలుగైదు రోజుల ముందే ఇటలీ ఫ్లైట్ ఎక్కేశారు. కాబోయే మెగా కోడలిలో చాలా మార్పు వచ్చిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Varun and Lavanya: అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయిపోయింది. అల్లు అరవింద్ ఏ ముహూర్తాన సరదాగా మా వాళ్లలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోమని చెప్పాడో గానీ.. అన్నట్టే మెగా ఇంటి కోడలు కాబోతోంది. మెగా బ్రదర్ నాగబాబు కొడుకు ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లికి రెడీ అవుతున్నారు.
ఇటలీలోని టుస్కానీలో వీరి పెళ్లి గ్రాండ్‌గా జరగనుంది. ఇప్పటికే పెళ్లి పనుల్లో బిజీగా ఉంది మెగా ఫ్యామిలీ. వరుణ్ తేజ్ పెద్దన్న రామ్ చరణ్, వదిన ఉపాసన చేతుల మీద పెళ్లి పనులు జరుగుతున్నాయి. నవంబర్ 1న ఈ పెళ్లి జరగనుంది. నవంబర్ 5న హైదరాబాద్‌లోని N కన్వెన్షన్‌లో రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నారు. ఈ జంట ఇటలీకి బయల్దేరారు. వరుణ్, లావణ్య ఇద్దరు కలిసి వెళ్తున్న ఎయిర్ పోర్ట్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వరుణ్, లావణ్య జంట చూడముచ్చటగా ఉందని అంటున్నారు.
లావణ్య డ్రెసింగ్ స్టైల్ గురించి ఇక్కడో ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తోంది. వాస్తవానికి లావణ్య త్రిపాఠి ఏనాడు కూడా హద్దులు దాటి సినిమాల్లో నటించలేదు. కాకపోతే.. ఈవెంట్స్, ఎయిర్ పోర్ట్‌కి వెళ్లినప్పుడు మాత్రం కాస్త స్టైలిష్‌గా కనిపించేది. వరుణ్‌తో నిశ్చితార్థం తర్వాత పూర్తిగా మారిపోయింది లావణ్య. ట్రెడిషినల్ లుక్‌లోకి వచ్చేసింది అమ్మడు. ప్రస్తుతం ఎయిర్పోర్ట్లోను పూర్తిగా ట్రెడిషనల్ వేర్లో కనిపిస్తోంది. ఫుల్ లాంగ్ క్రాప్ టాప్ పై అదే కలర్ షాల్ వేసుకొని వరుణ్‌తో కలిసి సందడి చేసింది. ఏదేమైనా.. మెగా కోడలు అంటే ఆ మాత్రం మెయింటేన్ చేయాల్సిందే లేండి.