TG: ఫార్ములా ఈ రేసు కేసులో ACB కీలక చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో మాజీమంత్రి KTRను A1గా, IAS అరవింద్ కుమార్ను A2గా పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా రూ.55 కోట్లు విదేశీ సంస్థలకు మళ్లించినట్లు అభియోగాలు మోపింది. BLN రెడ్డి, కిరణ్ మల్లేశ్వరరావు, యూకేకు చెందిన FEO సంస్థను కూడా నిందితులుగా చేర్చింది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించనుంది.