నెదర్లాండ్ జట్టుపై మ్యాక్స్ వెల్ విధ్వంసకర ఇన్సింగ్స్ గురించి భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందించారు. తాను ఖాతా తెరిచేందుకు 40 బంతులు తీసుకుంటానని.. అలాంటిది మ్యాక్స్ వెల్ ఏకంగా సెంచరీ బాదేశాడని పేర్కొన్నారు.
If it takes 40 balls to open the account.. Maxwell scored a century
sunil gavaskar: ఇటీవల నెదర్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ (sunil gavaskar) విశ్వరూపం చూపించాడు. కేవలం 40 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. దానిపై భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందించారు. ఓ మ్యాచ్‌లో పరుగుల ఖాతా తెరిచేందుకు తాను 40 బంతులు తీసుకున్నానని.. కానీ మ్యాక్స్ వెల్ 40 బంతుల్ల సెంచరీ చేశాడని గుర్తుచేశారు.
క్రికెట్లో అద్భుతమైన షాట్లలో రివర్స్ స్వీప్ ఒకటి అని గవాస్కర్ అన్నారు. ఓకే ఓవర్లో రివర్స్ స్వీప్ షాట్‌తో రెండు సిక్సులు కొట్టాడని తెలిపారు. అతనికి బౌలింగ్ ఎలా చేయాలో తెలియక బౌలర్లు అయోమయానికి గురయ్యారని పేర్కొన్నారు. ఎదుర్కొన్న బంతుల కంటే రెట్టింపు రన్స్ చేశారు. స్ట్రైక్ రేట్ అలాగే ఉందన్నారు. ఇదో అద్భుతం అని గుర్తుచేశారు.
వరల్డ్ కప్‌లో శ్రీలంకపై 49 బంతుల్లో ఐడెన్ మార్ క్రమ్ సెంచరీ చేశాడు. ఆ రికార్డును మ్యాక్స్ వెల్ బ్రేక్ చేశాడు. నెదర్లాండ్స్‌పై 40 బంతుల్లో సెంచరీ కొట్టిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో 27 బాల్స్‌లో మ్యాక్స్ వెల్ హాఫ్ సెంచరీ చేశాడు. తర్వాత 50 రన్స్‌ను కేవలం 13 బంతుల్లో చేశాడు. మ్యాక్స్ వెల్ మెరుపు ఇన్నింగ్స్ వల్ల ఆసీస్ 309 పరుగుల తేడాతో విజయం సాధించింది.