MNCL: పాడి రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేయించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం నస్పూర్‌లోని కలెక్టరేట్ ఆవరణలో జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల సంచార వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మార్చి 10 నుంచి ఏప్రిల్ 9 వరకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.