NLG: చిట్యాల మండలంలోని ఉరుమడ్లలో సోమవారం పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ సాగర్ల భానుశ్రీ బిక్షం, ఉప సర్పంచ్ ఉయ్యాల నరేష్ ఈ శిబిరాన్ని ప్రారంభించగా.. మొత్తం 63 గేదెలు, 39 ఆవులకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అమరేందర్ మాట్లాడుతూ.. రైతులు పశువులకు తప్పని సరిగా టీకాలు వేయించాలని సూచించారు.