»Koffee With Karan Season 8 Th Deepika And Ranveers Wedding Video Goes Viral
Koffee with Karan8: దీపిక, రణ్వీర్ పెళ్లి వీడియో వైరల్
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాఫీ విత్ కరణ్(karan johar) సీజన్ 8 డిస్నీ+ హాట్‌స్టార్‌లో అక్టోబర్ 26న ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ మొదటి ఎపిసోడ్ కు గెస్టులుగా రాగా..వీరి పెళ్లికి సంబంధించిన కీలక అంశాలను ఈ జంట పంచుకున్నారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
Koffee with Karan season 8 th Deepika and Ranveer's wedding video goes viral
కరణ్ జోహార్(karan johar) చాట్ షో కాఫీ విత్ కరణ్ 8వ సీజన్ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే(Deepika Padukone), రణవీర్ సింగ్(Ranveer Singh)లు గెస్టులుగా రావడంతో ప్రారంభమైంది. గతంలో షోలో కనిపించిన ఈ జంట, మొదటిసారి కలిసి ఇందులో కనిపించారు. అయితే ఈ జంట పెళ్లి జరిగి 5 సంవత్సరాలు అయిన నేపథ్యంలో కరణ్ జోహార్ వీరి అధికారిక పెళ్లి వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియో చూసిన అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. అంతేకాదు పలురకాలుగా కామెంట్లు సైతం చేయడం విశేషం. రణవీర్ దీపికను తాను ఎంతగా ప్రేమిస్తున్నాడో స్పష్టంగా కనిపిస్తుందని ఓ వ్యక్తి రాసుకొచ్చాడు.
This is the best thing that has ever happened on #KoffeeWithKaran.✨
ఒక పార్టీలో దీపికపై తనకున్న ప్రేమను రణవీర్ సింగ్ వ్యక్తం చేయడంతో క్లిప్ ప్రారంభమవుతుంది. క్లిప్‌లో మెహందీ వేడుక సహా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. వీడియోలో దీపిక నవ్వుతు ఉండగా.. రణవీర్ డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. వీడియోను ప్రదర్శించిన తర్వాత షో హోస్ట్ కరణ్ జోహార్ ఎమోషనల్ అయ్యాడు. 2018లో దీపికా పదుకొణె, రణవీర్ సింగ్‌లకు పెళ్లి జరిగింది. ఈ జంట నవంబర్ 14, 15న 2018లో ఇటలీలోని లేక్ కోమోలో వివాహం(marriage) చేసుకున్నారు. నవంబర్ 14న కొంకణి వివాహ ఆచారాల ప్రకారం, నవంబర్ 15న సిక్కు వివాహ వేడుకల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత బెంగళూరు, ముంబైలలో గ్రాండ్ రిసెప్షన్లు నిర్వహించారు. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా (2013) వీరిద్దరు కలిసి నటించిన మొదటి చిత్రం. ఆ తర్వాత ఈ జంట బాజీరావ్ మస్తానీ, “పద్మావత్”లో కూడా కలిసి నటించారు. ఈ జంట స్పోర్ట్స్ డ్రామా ’83లో కూడా స్క్రీన్ స్పేస్‌ను పంచుకున్నారు.