Pawan Kalyan: పవన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇక లేనట్టే!?
అందరు హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పాన్ ఇండియా మూవీ చేస్తే అదిరిపోతుందని.. అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు.. ఫస్ట్ అనౌన్స్ ప్రాజెక్ట్ లేనట్టేనని అంటున్నారు.
రీ ఎంట్రీ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు కమిట్ అయిన సంగతి తెలిసిందే. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో సినిమాలు రిలీజ్ అవగా.. ప్రజెంట్ ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పై ఉన్నాయి. పవన్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు షూటింగ్ జరుపుకుంటున్నాయి ఈ మూవీస్. కానీ హరిహర వీరమల్లు షూటింగ్ ఆగిపోయి చాలా రోజులు అవుతోంది. గత కొన్నాళ్లు అదిగో, ఇదిగో అనడమే తప్పా.. అసలు ఏ మాత్రం ముందుకు కదలడం లేదు హరిహర వీరమల్లు. అందుకు కారణం పవన్ రాజకీయంగా బిజీ అవడమే అని చెప్పొచ్చు. కానీ మిగతా సినిమాలకు డేట్స్ ఇస్తున్న పవన్.. ఈ సినిమాకు మాత్రమే ఎందుకు ఇవ్వడం లేదు? అనేది బిగ్ క్వశ్చన్ మార్క్.
రీ ఎంట్రీలో రీమేక్ సినిమాలు చేసిన పవన్.. క్రిష్‌తో స్ట్రెయిట్ ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’ను ప్రకటించి.. వెంటనే సెట్స్ పైకి తీసుకెళ్లాడు. పైగా పవన్ అనౌన్స్ చేసిన ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇదే కావడంతో.. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కానీ ఏం లాభం.. హరిహర వీరమల్లు తర్వాత మొదలైన సినిమాలు షూటింగులు జరుగుతున్నాయి, రిలీజ్ కూడా అవుతున్నాయి.. కానీ హరిహర వీరమల్లు అప్టేట్స్ మాత్రం బయటికి రావడం లేదు.
అసలు ఈ సినిమా ఉంటుందా? ఉండదా? అనే విషయంలో ఎవ్వరు క్లారిటీ ఇవ్వడం లేదు. లేటెస్ట్ లెక్క ప్రకారం.. ఈ సినిమా ఇక లేనట్టేనా? అనౌ డౌట్స్ వస్తున్నాయి. ఎందుకంటే.. దసరా రోజు ఆయుధ పూజ అంటూ.. ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి పోస్టర్స్ వచ్చాయి. కానీ హరిహర వీరమల్లు నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో.. అసలు హరిహర పరిస్థితేంటి? అనేది అర్థం కాకుండా పోయింది. మరి మేకర్స్ దీనిపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.