ప్రముఖ వ్యాపారవేత్త, వాఘ్ బక్ర్ టీ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ (Parag Desai) కన్నుముశారు. ఈనెల 15న వీధికుక్కలు దాడి నుంచి తప్పించుకునే క్రమంలో పరాగ్ తలకు తీవ్రగాయమైంది. శస్త్రచికిత్స చేసినా పరిస్థితి విషమంగానే ఉంది. మెదడు(Brain)లో రక్తస్రావం కావడంతో పరాగ్ ప్రాణాలు కోల్పోయారు. అహ్మదాబాద్(Ahmedabad)లో నివాసముంటున్న పరాగ్ దేశాయి.. ఈ నెల 15వ తేదీన మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లారు. ఇంటికి సమీపంలోని పార్కులో వాకింగ్ చేస్తుండగా, వీధి కుక్కలు ఆయనపై దాడి చేశాయి.
దీంతో కుక్కల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో ఆయన కింద పడిపోయారు. స్థానికుల సమాచారంతో పరాగ్‌ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే అపస్మారకస్థితిలో ఉన్న పరాగ్.. బ్రెయిన్ (Brain hemorrhage)హెమరేజ్ కారణంగా తుదిశ్వాస విడిచారు. వారం రోజుల పాటు చికిత్స పొంది, చివరకు నిన్న కన్నుమూశారు. వాఘ్ బక్రీ టీ కంపెనీ (Wagh Bakri Tea Company) ఇద్దరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లలో పరాగ్ దేశాయి ఒకరు. కంపెనీని ఈ-కామర్స్‌లోకి తీసుకెళ్లడంలో పరాగ్ కీలకపాత్ర పోషించారు. కంపెనీ సేల్స్, మార్కెటింగ్, ఎక్స్‌పోర్టు వంటి పనులను పర్యవేక్షించేవారు.