ASR: తీవ్ర ఎండలు, ఉష్ణగాలుల దృష్ట్యా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ‘సమ్మర్ ఆక్షన్ ప్లాన్’ రూపొందించుకొని జిల్లాలోని అన్ని జన సముదాయలు, కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈమేరకు సోమవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ఆయన వీసీ నిర్వహించారు. అలాగే, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.