సాధారణ పెట్రోల్ కంటే పవర్ పెట్రోల్లో ఆక్టేన్ రేటింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఇంజిన్ శబ్దాలను తగ్గించి లోపల శుభ్రంగా ఉంచుతుంది. సాధారణ బైకులు, కార్లకు మామూలు పెట్రోల్ సరిపోతుంది. కానీ ఖరీదైన, ఎక్కువ సామర్థ్యం గల వాహనాలకు పవర్ పెట్రోల్ వాడటమే మంచిది. కేవలం మైలేజీ కోసమే కాకుండా, ఇంజిన్ ఎక్కువ కాలం మన్నేలా ఇది ఉపయోగపడుతుంది.