Actress Sunaina: తమిళ నటి సునయన (Sunaina) అనారోగ్యానికి గురయ్యారు. ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫోటోను ఆమె షేర్ చేశారు. ఏమైందనే విషయాన్ని మాత్రం తెలియజేయలేదు. రాజ రాజ చోళ, లాఠీ వంటి తెలుగు సినిమాల్లో కూడా నటించారు. మాతృభాష తమిళంలో ఎక్కువ సినిమాలు చేశారు. తమిళ ఇండస్ట్రీలో సునయన అంటే క్రేజీ ఉంది. ఆమె అంటే అభిమానులు పడి చస్తారు.
సునయన (Sunaina) బెడ్‌పై పడి ఉండటమే కాదు.. ఆక్సిజన్ పెట్టుకుని కనిపించారు. దీంతో ఆమెకు ఏమైందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కొంత సమయం తర్వాత తిరిగి వస్తానని పేర్కొంది. ఏమైందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. సునయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.