»Man Adds Unique Touch To His Navratri Celebrations Dances Underwater
Navratri శోభ.. నీటిలో నృత్యం, వావ్ అంటోన్న నెటిజన్లు
జయదీప్ గోహిల్ అనే వ్యక్తి నీటిలో డ్యాన్స్ చేశాడు. నవరాత్రి సందర్భంగా స్పెషల్ డ్యాన్స్ చేసి ఇన్ స్టలో పోస్ట్ చేశారు. అతని సృజనాత్మకతను ప్రతీ ఒక్కరు ప్రశంసిస్తున్నారు.
Man adds unique touch to his Navratri celebrations, dances underwater
Navratri celebrations: దేవి నవరాత్రులు (Navratri celebrations) కొనసాగుతున్నాయి. ఈ 9 రోజులు భక్తులు నిష్టతో ఉంటారు. ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తుంటారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో పూజ చేస్తారు. ఒక్కొక్కరు ఒకలా తమ భక్తిని చాటుకుంటారు. ఇక ఆర్టిస్టుల గురించి అయితే చెప్పక్కర్లేదు. జయదీప్ గోహిల్ అనే వ్యక్తి.. నీటిలో డ్యాన్స్ చేసి వావ్ అనిపించాడు.
జయదీప్ అండర్ వాటర్ డ్యాన్స్ చేయడంలో ఫేమస్. సాంప్రదాయ దుస్తులు వేసుకొని.. కళ్లకు అద్దాలు కూడా పెట్టుకున్నాడు. దాండియాలో ఉపయోగించే లాఠీలు పట్టుకొని ఉన్నాడు. నీటిలో లైటింగ్ ఏర్పాటు చేసి.. వీడియో తీశాడు. వెనకాల డోలు కూడా కనిపించాయి. రాధే రాధే సాంగ్ రాగానే డ్యాన్స్ చేశాడు. డిఫరెంట్ స్టెప్పులు వేసి అలరించాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతుంది.
దేశంలో తొలి అండర్ వాటర్ డ్యాన్సర్ జయదీప్.. ఇదే విషయాన్ని ఇన్ స్ట బయోలో రాసుకున్నారు. ఇన్ స్టా పేజీలో మరికొన్ని వీడియోలు కూడా ఉన్నాయి. నీటిలో డ్యాన్స్ చేసే ఇతర వీడియోలు ఉన్నాయి. నవరాత్రికి సంబంధించిన వీడియోలో మాత్రం ‘స్వర్గంలో నవరాత్రి’ అని రాసుకున్నాడు. రెండురోజుల క్రితం వీడియోను షేర్ చేశారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది.
వీడియోకు ఇప్పటికే 6.7 మిలియన్ వ్యూస్ వచ్చాయి. నీటిలో అలా డ్యాన్స్ చేయడం కష్టం అని.. చాలా మంది అతనిని ప్రశంసిస్తున్నారు. ఇలాంటి వీడియో చేయడం చాలా గ్రేట్ అని ఒకరు.. సెల్యూట్ అని మరొకరు.. ఉభయచర జీవివా అని ఇంకొకరు.. నీటిలో, భూమిపై జీవించగలవా అని మరొకరు రాశారు. జయదీప్ చేసిన డ్యాన్స్ నెటిజన్లను ఆకట్టుకుంది.