రవితేజ (Raviteja) నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. స్టూవర్టుపురంలో పేరుమోసిన గజదొంగ ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswararao) జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి వంశీకృష్ణ దర్శకత్వం వహించారు. ఇందులో నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, నాజర్‌లు ప్రత్యేక పాత్రల్లో నటించారు. ఈ రోజు(అక్టోబర్ 20న) విడుదలైన ఈ సినిమా హిట్టా ఫట్టా అనేది ఇక్కడ తెలుసుకుందాం.
చిత్రం:టైగర్ నాగేశ్వరరావు నటీనటులు:రవితేజ, నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, నాజర్, జిషు సేన్ గుప్తా, అనుపమ్ ఖేర్, తదితరులు సంగీతం:జి.వి.ప్రకాశ్ కుమార్ నిర్మాతలు:అభిషేక్ అగర్వాల్ కథ, కథనం మాటలు, దర్శకత్వం: వంశీ కృష్ణ విడుదల తేదీ: 20/10/2023
తెలుగు రాష్ట్రాలను ఒక వణుకు వణికించిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌గా వచ్చింది ఈ చిత్రం. ఇంతకీ ఎవరీ టైగర్ నాగేశ్వరరావు. గజ దొంగగా ఇతని ప్రత్యేకత ఏంటి? ఈ బయోపిక్ ద్వారా సమాజానికి అతని గురించి ఏదైనా విషయం అందించారా? వంటి విషయాలు ఈ సినిమాలో ఉన్నాయి. మరి ఈ రియల్ స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో అనేది ఇప్పుడు ఈ రివ్యూలో చూద్దాం.
కథ
ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి రాఘవేంద్ర రాజ్‌పుత్ (అనుపమ్ ఖేర్) కరుడుగట్టిన క్రిమినల్ టైగర్ నాగేశ్వరరావు (రవితేజ) గురించి వివరాలు తెలుసుకోవాలని అనుకుంటాడు. ఇతను వివరాలు తెలుసుకోవాలని అనుకోవడానికి ముఖ్యకారణం ప్రధానమంత్రి కార్యాలయాన్ని దోచుకుంటానని నాగేశ్వరరావు సవాలు విసురుతాడు. నాగేశ్వరరావు స్టూవర్టుపురం ప్రాంతానికి చెందిన గజ దొంగ. ఇలా దొంగతనం చేసిన డబ్బును పేదలకు పంచిపెడుతుంటాడు. అయితే టైగర్ నాగేశ్వరరావు ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఎందుకు దోచుకోవాలనుకున్నాడు? అతని ఆలోచన ఏంటి? అతని జీవితంపై సినిమా తీసేంత పేరు ఎలా వచ్చిందో తెలియాలంటే మాత్రం పూర్తి సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
రైలు దోపిడీ సీన్‌తో ప్రారంభమైన ఈ సినిమా మొదట్లో ఆసక్తిగానే ఉంటుంది. కానీ ఫస్ట్‌లో ఉన్నంత హైప్‌ను సినిమా అంతా కొనసాగనియ్యలేదనే చెప్పవచ్చు. సినిమాలో టైగర్ నాగేశ్వరావు రెండు విధాలుగా కనిపిస్తారు. దొంగతనం చేసే గజ దొంగగా, పేదలకు సాయం చేసే మంచి మనిషిగా చూపిస్తారు. సినిమా ఫస్ట్ ఆఫ్‌లో నాగేశ్వరరావులోని క్రూరత్వాన్ని చూపిస్తారు. తర్వాత లవ్ సీన్స్ కనిపిస్తాయి. ఈ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకోవు. కథ ఎటు నుంచి ఎటు వెళ్తుందో తెలియదు. రేణు దేశాయ్ పాత్ర ఆశించినంతగా అనిపించదు. సెకండ్ ఆఫ్‌లో తక్కువ సమయంలో యాక్షన్ డ్రామాగా మారుతుంది. కొన్ని సన్నివేశాలు యాక్షన్‌గా కనిపిస్తాయి. డైలాగ్‌లు కొత్తగా అనిపించవు. ఫ్లాష్‌బాక్ కథ కూడా అంతగా ఆకట్టుకోదు. సెకండ్ ఆఫ్ కొద్దిగా స్లోగా ఉంటుంది.
ఎవరెలా చేశారంటే?
డార్క్ క్యారెక్టర్లో హీరో రవితేజ నటన, ఎంట్రీ సూపర్ అని చెప్పవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే టైగర్ నాగేశ్వరరావు పాత్రకు రవితేజ ఇమిడిపోయారు. హీరోయిన్ నూపూర్ సనన్, గాయిత్రి భరద్వాజ్ వాళ్ల పాత్రలకు న్యాయం చేశారు. సెకండ్ ఇన్నింగ్స్‌తో ఎంట్రీ ఇచ్చిన రేణుదేశాయ్ పాత్ర అంత గుర్తిండిపోయే విధంగా లేదనే చెప్పవచ్చు. బయోపిక్ అంటే సాధారణంగా అందరికీ తెలిసిన విషయాలే ఎక్కువగా ఉంటాయి. వీటినే కొత్తగా, ఇంట్రెస్టింగ్గా చూపించగలగాలి. ఈ విషయంలో డైరక్టర్ ఫెయిల్ అయ్యాడనే చెప్పవచ్చు.
సాంకేతిక అంశాలు
హీరో ఎలివేషన్స్ అనుకున్న రీతిలో లేవు. జీవీ ప్రకాశ్ పాటలు సినిమాకి అంతగా ఆకట్టుకోలేదు. కానీ BGM కొన్ని సీన్లకు సెట్ అయ్యింది. ఎడిటింగ్, ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ సాధారణంగా ఉన్నాయనే చెప్పవచ్చు. మూవీ రన్ టైం కూడా ఎక్కువగానే ఉంది.
ప్లస్ పాయింట్స్
+రవితేజ యాక్టింగ్
+ట్రైన్ సీన్
మైనస్ పాయింట్స్
-కథలో బలం లేకపోవడం
-రొటీన్ స్టోరీ
-రన్ టైమ్
-లవ్ సీన్స్
-పాటలు, BGM
-సెకండ్ ఆఫ్ ల్యాగ్