MNCL: నస్పూర్ పరీక్షా కేంద్రంలో సోమవారం ఓ విద్యార్థిని పరీక్ష రాస్తుండగా స్పృహతప్పి పడిపోయింది. వెంటనే స్పందించిన మెడికల్ సిబ్బంది పుష్ప, 108 అంబులెన్స్ సిబ్బంది లక్ష్మయ్య, అరవింద్ ఆమెకు ప్రథమ చికిత్స అందించారు. ఆరోగ్యం సహకరించకపోయినా, విద్యా సంవత్సరం వృథా కాకూడదనే సంకల్పంతో తిరిగి పరీక్ష రాసింది. ఆమె పట్టుదలను చూసి తోటి అందరు ప్రశంశించారు.