»Britains Full Support For Israel Prime Minister Rishi Sunak
Rishi Sunak: ఇజ్రాయెల్‌కు మద్దతు తెలిపిన రిషి సునాక్..హమాస్‌ను కట్టడి చేసేందుకు ప్రణాళిక!
ఇజ్రాయెల్-హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్దం జరుగుతోంది. ఈ సమయంలో బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఆ దేశ ప్రధానిని కలిశారు. ఈ యుద్దంలో ఇజ్రాయెల్ గెలవాలని కోరారు. బ్రిటన్ పూర్తి మద్దతు ఇజ్రాయెల్‌కు ఉంటుందని ప్రకటించారు.
Britain's full support for Israel.. Prime Minister Rishi Sunak
Rishi Sunak: ఆగస్టు 7 నుంచి ఇజ్రాయెల్, పాలస్తీనా ఉగ్రవాదుల నడుమ యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరుదేశాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అంతే కాకుండా పెద్ద మొత్తంలో ప్రాణనష్టం జరుగుతోంది. ఈ క్రమంలో ప్రపంచ దేశాల నుంచి ఇజ్రాయెల్‌కు మద్దతు లభిస్తుంది. హమాస్ ఉగ్రవాదులపై ఎలాగైనా విజయం సాధించాలని ఇజ్రాయెల్ పోరాడుతోంది. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ (Rishi Sunak) ఆ దేశానికి వెళ్లాడు. హమాస్ (Hamas)ను ఓడించే విషయంలో ఇజ్రాయెల్ (Israel)కు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఇజ్రాయెల్- హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం కొనసాగుతోన్న వేళ రిషి సునాక్ గురువారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Netanyahu)తో భేటీ అయ్యారు. మధ్య ఆసియాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా రిషి సునాక్ నేడు ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో రిషి సునాక్ మాట్లాడారు… హమాస్ మిలిటెంట్లు వలన పౌరులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, ఇజ్రాయెల్ అలా కాదని, పౌరులకు ఎటువంటి హాని కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని అన్నారు. పాలస్తానియన్లు కూడా హమాస్ బాధితులే అని పేర్కొన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఓ స్నేహితుడిలా మీతో నిలబడతానని, ఇజ్రాయెల్ విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు రిషి సునాక్ వెల్లడించారు.
ఈయన కన్నా ముందే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఇజ్రాయెల్‌ను సందర్శించారు. అమెరికా కూడా హమాస్‌ను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పింది. బైడన్ పర్యటన ముగించుకొని వెళ్లిన తరువాత హమాస్ రాకెట్లతో విరుచుకుపడిందని అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి.