W.G: ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ ప్రక్రియను తక్షణమే నిలుపుదల చేయాలని PRTU జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చలం, M. శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆకివీడులో వారు మాట్లాడుతూ.. విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిని 1:49 నుంచి 1:40కి కుదించాలని కోరారు. లేనిపక్షంలో ఉన్నత పాఠశాలల్లో అనేక పోస్టులు రద్దయ్యే ప్రమాదం ఉందని అందోళన వ్యక్తం చేశారు.