తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన లియో చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. దాదాపు 35 దేశాల్లో ఈ చిత్రాన్ని నేడు(అక్టోబర్ 19న) రిలీజ్ చేశారు. యూరప్, నార్త్ అమెరికా, దుబాయ్, ఇండియాతో సహా మొత్తం 12 వేల స్క్రీన్లలో విడుదలైంది. మరి ఈ సినిమా స్టోరీ ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
చిత్రం: లియో నటీనటులు: విజయ్, త్రిషా, అర్జున్ సర్జా, సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, తదితరులు దర్శకుడు: లోకేష్ కనగరాజ్ నిర్మాత: S. S. లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి రచయిత: లోకేష్ కనగరాజ్, రత్న కుమార్, దీరజ్ వైద్య సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచంద్రన్ సినిమాటోగ్రాఫర్: మనోజ్ పరమహంస ఎడిటర్: ఫిలోమిన్ రాజ్ విడుదల తేది: 19/10/2023
Leo Movie Review: తమిళ్ సూపర్ స్టార్ ఇళయ దళపతి విజయ్(Vijay), స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) కాంబినేషన్లో వచ్చిన చిత్రం లియో(LEO). ఈ చిత్రం ట్రైలర్‌తోనే భారీ అంచనాలను క్రియేట్ చేసింది. నిజానికి వీరి కాంబినేషన్ ప్రకటించినప్పుడే సినిమాకు కావాల్సినంత హైప్ వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్(Sanjay Dath), స్టార్ హీరో అర్జున్(Arjun), బ్యూటీఫుల్ హీరోయిన్ త్రిషా కృష్ణన్(Trisha), గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు నటించిన లియో నేడు(అక్టోబర్ 19న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుకున్నట్టే ప్రేక్షకుల అంచనాలను అందుకుందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
పార్థిబన్ (దళపతి విజయ్) హిమాచల్ ప్రదేశ్‌లో తన భార్య సత్య (త్రిష) ఇద్దరు పిల్లలతో నివసిస్తుంటారు. ఆ ప్రశాంతమైన వాతావరణంలో పార్థిబన్ ఓ కాఫీ షాప్‌ను రన్ చేస్తుంటాడు. అలా ప్రశాంతంగా సాగుతున్న కథలో ఒక రోజు తన కాఫీ షాపులో ఓ సంఘటన జరుగుతుంది. దానికి కారణం ఆంటోనీ దాస్ (సంజయ్ దత్), హెరాల్డ్ దాస్ (అర్జున్). దాంతో పార్థిబన్ జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. పార్థిబన్ దాసును లియో దాసు అనుకుని అతన్ని నానా ఇబ్బందులకు గురిచేస్తాడు హెరాల్డ్ దాస్. అంతే కాకుండా తన ఫ్యామిలీని కూడా డిస్టర్బ్ చేస్తాడు. అసలు లియో దాస్ ఎవరు.? లియో దాస్‌కు ఆంటోనీ దాస్‌కు ఉన్న సంబంధం ఏంటి? పార్థిబన్ కుటుంబాన్ని హోరల్డ్ దాస్ ఎందుకు ఇబ్బంది పెట్టాడు? పార్థిబన్ ముందున్న సవాళ్లను అధిగమించాడా లేదా? లియో దాస్‌కు పార్థిబన్‌కు ఏంటి సంబంధం అనే అంశాలు తెలుసుకోవాలంటే మాత్రం పూర్తి సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది:
పార్థిబన్ ఫ్యామిలీతో హిమాచల్ ప్రదేశ్‌లో నివసిస్తుంటారు. చిన్న ఫ్యామిలీ ఎలాంటి సమస్యలు ఉండవు. చక్కగా ఓ కాఫీ షాప్ నడుపుకుంటూ ఉంటారు. ఫస్ల్ 30 మినిట్స్ అంతా కథలో మెయిన్ ప్లాట్‌ను చెప్పడానికి స్టోరీని పరుగెత్తిస్తారు. తరువాత ఒక యాక్షన్ సీక్వెన్స్ తరువాత కథ నెమ్మదిస్తుంది. హీరోపై ఛేజింగ్ సీన్స్ చాలా బాగుంటాయి. తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం పార్థిబన్ కష్టడుతూ ఉంటాడు. అతని వెనుక పడే గ్యాంగ్స్ ఎవరో తెలియకుండా పరుగెడుతూనే ఉంటాడు. ట్రైలర్లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచిన హైనా సీక్వెన్స్ కొంచమే ఉంటుంది. కానీ చాలా బాగా ఆకట్టుకుంటుంది. అలా ప్రీ-ఇంటర్వెల్ వరకు కొనసాగుతుంది. ఇక ఇంటర్వెల్ టైమ్‌లో ఓ మెయిన్ విలన్ ఎంట్రీతో సినిమాపై హైప్ క్రియేట్ అవుతుంది. ఇక రెండవ భాగం లియో దాస్ ఫ్లాష్ బ్యాక్ మొదలౌతుంది. నా రెడీ సాంగ్‌తో లియో ఎంట్రీ ఉంటుంది. లియో కథ మొత్తం నేరసామ్రాజ్యంలోనే కొనసాగుతుంది. సెకండాఫ్ యాక్షన్ సీన్స్ చాలా బాగుంటాయి. ఇక ప్రీ క్లైమాక్స్ వరకు కథా కాస్తా నెమ్మదించిన అసలు ట్విస్ట్‌తో కథ పుంజుకుంటుంది. ఇక క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ అయితే ఓ రేంజ్లో తెరకెక్కించారు.
ఎవరెలా చేశారు:
సినిమా మొత్తం విజయ్ వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. రెండు పాత్రల్లో విజయ్ నటన మెప్పిస్తుంది. ఈ మధ్య వచ్చిన విజయ్ సినిమాల్లో లియోలోనే బెస్ట్ ఫర్ఫార్మెన్స్ కనబరిచాడు. లియో దాస్‌గా తన ఎనర్జీ ఈ సినిమాకు చాలా కలిసి వచ్చింది. ఫైట్స్, సాంగ్స్ పరంగా ఆయనకు ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. ఫ్యాన్ మూమెంట్స్ లియోలో చాలా ఉన్నాయి. హీరోయిన్ త్రిషా చాలా డిసెంట్ యాక్టింగ్ చేసింది. తెరమీద చాలా ప్లెజెంట్‌గా కనిపిస్తుంది. విలన్‌గా అర్జున్ దాస్ నెక్ట్స్ లెవల్ యాక్టింగ్. సెకండ్ హాఫ్‌లో చాలా వరకు లియోదాస్, హెరల్డ్ దాస్ నడుమ బీభత్సమైన యాక్షన్ సీన్స్ ఉంటాయి. అందులో ఇద్దరు పోటీ పడి యాక్ట్ చేశారు. అలాగే బాలీవుడ్ బ్యాడ్ బాయ్ సంజయ్ దత్ తన పాత్రకు ప్రాణం పోశాడు. ఇక పోలీసు ఆఫీసర్‌గా కనిపించిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ తన పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నాడు.
సాంకేతిక అంశాలు:
గత సినిమాలతో తన మేకింగ్ స్టైల్ ఏంటో ప్రేక్షకులకు రుచి చూపించిన డైరెక్టర్ లోకేష్ లియోతో నెక్ట్స్ లెవల్ మేకింగ్‌ను పరిచయం చేశాడు. ప్రతి సీన్ చాలా ఇంటెన్సీవ్‌గా తెరకెక్కించారు. ఫస్ట్ ఆఫ్‌లో 30 నిమిషాల వరకు స్పీడ్‌గా వెళ్లిన సినిమా తరువాత నెమ్మదిస్తుంది. దానికి ప్రీ ఇంటర్వేల్ గూస్ బంప్స్ వచ్చేలా బెస్ట్ ప్లే ఆఫ్‌ను సెట్ చేసుకున్నారు. అలాగే సెకండ్ ఆఫ్ కూడా అదే ప్యాటర్న్‌తో ప్రేక్షకుల చేత అరుపులు పెట్టించారు. సినిమా మొత్తం లోకేష్ మేకింగ్ స్టైల్‌తో వావ్ అనిపించారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదు. అల్రెడీ పాటలతో సూపర్ హిట్ అనిపించుకున్నారు. ఇక బీజీఎం విషయానికి వస్తే ఎలివేషన్ సీన్లకు ఆయన మ్యూజిక్ ప్రాణం పోసింది. సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస అదరగొట్టాడు. ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా అనిపిస్తుంది. లైటింగ్, పోస్టర్స్ అన్ని చాలా స్టైల్‌గా తీశారు. ఎడిటర్ ఫిలోమిన్ రాజ్ పనితనం బాగుంది. అక్కడక్కడ ల్యాగ్ అనిపించినా అది స్టోరీలో భాగమే అనిపిస్తుంది. ఇక ప్రోడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి.