»Sri Lanka Winning The Toss And Batting 14th Icc Odi World Cup 2023 Match
AUSvSL: టాస్ గెల్చి బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక..మ్యాచ్ గెలుస్తుందా?
ఐసీసీ ODI ప్రపంచ కప్ 2023లో నేడు 14వ మ్యాచ్ ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య జరుగుతోంది. అయితే మొదట టాస్ గెల్చిన లంక ఆటగాళ్లు బ్యాటింగ్ ఎంచుకున్నారు. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు గెలుస్తుందో ఓసారి అంచనాలను చుద్దాం.
Sri Lanka winning the toss and batting 14th icc odi world cup 2023 match
ICC వన్డే క్రికెట్ ప్రపంచ కప్ 2023లో నేడు ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య 14వ మ్యాచ్ జరుగుతోంది. అయితే టాస్ గెల్చిన శ్రీలంక జట్టు బ్యాటింగ్ ఎంచుకోగా..ఆస్ట్రేలియా బౌలింగ్ షూరు చేసింది. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్లలో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇప్పుడు చుద్దాం. లక్నోలోని భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. స్పిన్నర్లు, స్లో బౌలర్లకు ఈ స్టేడియం ప్రసిద్ధి చెందింది. దీని కారణంగా తరచుగా ఇక్కడ తక్కువ స్కోర్ చేస్తారని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆస్ట్రేలియా ఇప్పటి వరకు శ్రీలంకతో 103 వన్డేలు ఆడగా అందులో 63 విజయాలు సాధించింది. శ్రీలంక కేవలం 36 మాత్రమే గెలుచుకుంది. అయితే వాటిలో నాలుగింటి ఫలితాలు తేలలేదు. ఇక ప్రపంచ కప్‌లలో ఈ రెండు జట్లు 11 సార్లు తలపడగా, ఆస్ట్రేలియా 8 సార్లు గెలిచింది. శ్రీలంక రెండుసార్లు మాత్రమే విజయం సాధించింది. ఇక గూగుల్ గెలుపు సంభావ్యత ప్రకారం ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచే అవకాశం 76% ఉందని తెలిపింది. అయితే దీనిపై మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఆస్ట్రేలియా జట్టులో : మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్(w), గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(సి), ఆడమ్ జంపా మరియు జోష్ హేజిల్‌వుడ్ ఉన్నారు.
శ్రీలంక జట్టులో :పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్(w/c), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, చమిక కరుణరత్నే, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, లహిరు కుమార మరియు దిల్షన్ మధుశంక ఉన్నారు.