KCR Bhima- Prati Intiki Dhima kcr announce Promise
KCR Bhima- Prati Intiki Dhima: మైనార్టీల సంక్షేమానికి పాటుపడ్డామని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. గత తొమ్మిదిన్నరేళ్లలో ఇచ్చిన హామీలే కాదు.. ఇవ్వనివి చేసి చూపించమని చెబుతున్నారు. ఈ సారి వినాయక నిమజ్జనం రోజు ముస్లింలు మత సామరస్యం వెల్లువిరిసేలా ప్రవర్తించారని గుర్తుచేశారు. మైనార్టీ బడ్జెట్ మరింత పెంచుతామని చెబుతున్నారు. దళిత బంధును కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆదివాసీలను గత 50 ఏళ్ల నుంచి ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. గిరిజన గూడేలు, లంబాడీ తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేశామని అంటున్నారు. పోడు భూముల పట్టాలు కూడా ఇచ్చామని పేర్కొన్నారు. వారిపై ఉన్న కేసులు కూడా ఎత్తివేశామని చెప్పారు. రైతుబంధు, రైతు భీమా ఇస్తున్నామని వివరించారు.
తెలంగాణ రాష్ట్రం మాంసం ఎగుమతుల్లో నంబర్ వన్ స్థానానికి చేరిందని కేసీఆర్ గుర్తుచేశారు. చేపల పెంపకం కూడా పెరిగిందని అన్నారు. బీసీలకు సాయం కొనసాగిస్తామని చెబుతున్నారు. బీసీలకు రూ.1 లక్ష సాయం చేశామని.. దానిని భవిష్యత్లో కూడా కొనసాగిస్తామని పేర్కొన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్, తలసరి విద్యుత్ వినియోగంలో నంబర్ వన్, మంచినీటి విషయంలో నంబర్ వన్ అని చెప్పారు. రాష్ట్ర ఆదాయం పెంచాలి.. పేదలకు అన్నీ వర్గాలకు పంచాలని నిర్ణయం తీసుకొని.. తప్పకుండా అమలు చేశాం అన్నారు. బెస్ట్ ఎకనామికి, బెస్ట్ పవర్ పాలసీ, బెస్ట్ ఇరిగేషన్ పాలసీ, బెస్ట్ అగ్రికల్చర్ పాలసీ, బెస్ట్ దళిత్ పాలసీ, బెస్ట్ హెల్త్ పాలసీ, బెస్ట్ ఇండస్ట్రీయల్ పాలసీని అమలు చేసి.. చూపాం అన్నారు. ఆ పాలసీలను యథావిధిగా కొనసాగిస్తామని స్పష్టంచేశారు.
ప్రభుత్వ ఏర్పడిన 6 నెలల్లో అమలు చేస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెబుతున్నారు. రైతు బంధు, రైతు భీమా పథకం ద్వారా లక్షకు పైగా కుటుంబాలకు కొద్దీ రోజుల్లో ప్రయోజనం కలిగిందన్నారు. 5 వేల కోట్ల ప్రయోజనం కలిగిందన్నారు. చేనేత కార్మికులు, గీత కార్మికులకు భీమా తీసుకొచ్చాం అన్నారు. 1.03 కోట్ల కుటుంబాలు ఉండగా.. 1.10 లక్షల కుటుంబాల్లో.. 93 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డు ఇచ్చామన్నారు. 93 లక్షల కుటుంబాలు కలిగిన భీమా చేయిస్తామన్నారు. కేసీఆర్ భీమా- ప్రతీ ఇంటికి ధీమా పథకం అమల్లోకి తీసుకొస్తామని తెలిపారు. 4 వేల వరకు ఖర్చు చేస్తాం అంటున్నారు. రూ.5 లక్షలు వచ్చేవిధంగా యాక్సిడెంట్ కాదు.. నాచురల్ డెత్ అయినా సరే రూ.5 లక్షలు ఇస్తామని స్పష్టంచేశారు.