తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ (Congress) విడుదల చేసింది. మొత్తం 55 మందితో ఈ జాబితాను ప్రకటించింది. బీసీలకు 28 సీట్లు కేటాయించన్నట్లు తెలుస్తోంది. సర్వేలు, ఇతర అంశాల ఆధారంగా పార్టీ అధిష్టానం ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.మొత్తం 55 మంది అభ్యర్థుల జాబితాతో ఫస్ట్ లిస్ట్ (First list) విడుదల చేశారు. వివాదం లేని స్థానాలను తొలుత ప్రకటించింది. రెండు మూడు రోజుల్లో మిగిలిన స్థానాల అభ్యర్థులను సైతం ఖరారు చేయనున్నది.
ఫస్ట్ లిస్టులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy), ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, పొదెం వీరయ్య, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, పేర్లు ఉండగా.. ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి (Ponguleti) శ్రీనివాసరెడ్డి పేర్లు లేకపోవడం గమనార్హం. ఇటీవల పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు మొదటి జాబితాలోనే చోటు సంపాదించుకున్నారు.