Wife:దిండుతో మొహంపై అదిమి, పాముతో కాటు వేయించి.. హత్య
మూడు ముళ్లు వేయించుకొని, ఏడు అడుగులు నడిచి.. చివరికీ భర్తనే కాటికి పంపింది లలిత. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో కఠిన నిర్ణయం తీసుకుంది. భర్త వద్ద పని చేసే వారితో పని పూర్తి చేసింది. తన బాగోతం తెలియదని అనుకుంది. చేసిన తప్పుకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తోంది.
Wife Killed Her Husband: బిల్డర్‌ను భార్య చంపించింది. అవును.. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, మానాలని కోరితే వినడం లేదని అంటోంది. ఆ విషయంపై ఇంట్లో.. లేదంటే బంధువుల సమక్షంలో మాట్లాడుకుంటే సరిపోయేది. కానీ చంపే వరకు వెళ్లింది. ఇప్పుడు జైలులో ఊచలు లెక్కబెడుతోంది.
భర్త హత్య
మొన్న ఏపీలో ఓ బిల్డర్ సూసైడ్ చేసుకోగా.. ఇప్పుడు తెలంగాణలో మరో బిల్డర్ హత్యకు గురయ్యాడు. రెండు దాదాపు సేమ్.. అక్కడ, భార్య వేధింపులు తాళలేక సూసైడ్ చేసుకున్నాడు. ఇక్కడ భార్యే భర్తను చంపించింది. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఈ ఘటన జరిగింది. మార్కండేయ కాలనీకి చెందిన స్థిరాస్థి వ్యాపారి, బిల్డర్ కొచ్చెర ప్రవీణ్ దారుణ హత్యకు గురయ్యాడు. ప్రవీణ్‌కు కొన్నెళ్ల క్రితం లలితతో పెళ్లి అయ్యింది. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఫ్యామిలీ సాఫీగా సాగిపోతుంది. భార్య ఉండగానే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ప్రవీణ్. ఇది అతని ప్రాణాలు తీసేవరకు వెళ్లింది. నిజానికి ఇది తప్పే.. భర్త గురించి లలితకు తెలిసింది. వద్దు, మానుకోవాలని కోరింది. అయినా ప్రవీణ్ వినిపించుకోలేదు.. చెప్పి, చెప్పి, అలసిపోయింది. ఇక లాభం లేదు అని.. చంపించాలని నిర్ణయం తీసుకుంది.
పనిచేసే వారితో మర్డర్
ప్రవీణ్ బిల్డర్ కాగా.. అతని వద్ద పనిచేసే వారితో లలిత ఒప్పందం చేసుకుంది. తన భర్తను చంపిస్తే ఓ ప్లాట్ ఇస్తానని సెంట్రింగ్ పనిచేసే మచ్చ సురేశ్‌కు మాట ఇచ్చింది. అందుకు అంగీకరించి, ఇందారపు సతీశ్, మాస శ్రీనివాస్, భీమ గణేశ్, నన్నపురాజు చంద్రశేఖర్ హెల్ప్ తీసుకున్నాడు. హత్య చేసేందుకు ఖర్చుల కోసం 34 గ్రాముల బంగారు గొలుసును వారికి లలిత ఇచ్చింది. సమయం కోసం చూశారు. ఈ నెల 9వ తేదీన రామగుండంలో సురేశ్, సతీశ్, శ్రీనివాస్, గణేశ్, చంద్రశేఖర్ కలిసి డ్రింక్ చేశారు. అర్ధరాత్రి లలితకు ఫోన్ చేసి ఇంటికి వచ్చారు. అప్పటికే ప్రవీణ్ గాఢ నిద్రలో ఉన్నాడు. సరాసరి బెడ్ రూమ్‌లోకి వచ్చి మొహం మీద దిండు పెట్టి చంపే ప్రయత్నం చేశారు. ప్రవీణ్ మెల్కొవడంతో తమ వెంట తెచ్చుకున్న పాముతో కాటు వేయించారు. తర్వాత ఆ పామును బయట వదిలేసి వెళ్లిపోయారు. తన భర్త హత్య జరుగుతుండగా లలిత పక్క గదిలో ఉండి, చూసింది.
స్ట్రోక్ వచ్చిందని
ప్రవీణ్ హత్య జరిగిన తెల్లవారి అతనికి బాలేదని, గుండెపోటు వచ్చిందని నమ్మించే ప్రయత్నం చేసింది. ప్రవీణ్ తల్లికి ఫోన్ చేసి చెప్పింది. ఇంటికి వచ్చి చూడగా కుమారుడు చనిపోయి ఉన్నాడు. లలితపై అనుమానం వచ్చింది. వెంటనే పోలీసు కేసు పెట్టింది. ప్రవీణ్ పోస్టుమార్టం రిపోర్టులో మాత్రం గుండెపోటు రాలేదని రావడంతో సందేహాం కలిగింది. ఏం జరిగిందని లలితను విచారిస్తే అసలు విషయం బయటపడింది. ప్రవీణ్‌ను హత్య చేసిన లలిత సహా ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.