మీకు నూడుల్స్ ఇష్టమా? అదీ వీధి బండ్లలోపై దొరికే ఫుడ్ ఇష్టంగా తింటారా? అయితే మీరు ఈ వీడియో తప్పకుండా చూడండి. నూడుల్స్ ఎలా తయారు చేస్తారనే వీడియోనే పీఎఫ్సీ క్లబ్ ఫౌండర్ చిరాగ్ భట్టాచార్య ట్విట్టర్లో షేర్ చేశారు. 59 సెకన్ల నిడివి గల వీడియోలో నూడుల్స్ తయారీని చూపించారు. పరిశుభ్రతను మాత్రం మరిచారు. ఓ సారి వీడియో చూస్తే.. మరోసారి స్ట్రీట్ సైడ్ నూడుల్స్ తినే ధైర్యం చేయరు. వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. 2 లక్షల వ్యూస్ వచ్చాయి. చాలా మంది లైక్ కొడుతున్నారు. మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
ఓ చిన్న నూడుల్ ఫ్యాక్టరీలో వీడియో తీశారు. కొందరు కార్మికులు నూడుల్ తయారీలో ఉన్నారు. ముందుగా పిండిని మిక్సర్ (గిర్ని)లో వేస్తారు. బయటకు తీసి నూడుల్స్ మాదిరిగా కట్ అయ్యేందుకు మరొ మిషన్‌లో వేస్తారు. ఈ ప్రక్రియ చేసే సమయంలో గ్లౌజ్ వేసుకోలేదు. నూడుల్స్ చేతితో తీసి, ఉడకబెట్టారు. వాటిని తీసి కింద పడేశారు. అవి ఆరిపోయిన తర్వాత ప్లాస్టిక్ సంచుల్లో ప్యాక్ చేశారు. నూడుల్స్ తయారీలో ఎక్కడ కూడా శుభ్రత పాటించలేదు. చేతులతో ముట్టుకొని, కింద పడేశారు. వాటిని అలా ప్యాక్ చేసి పంపిస్తున్నారు. మీరు చివరిగా సారిగా రోడ్డు మీద చైనీస్ హక్కా నూడుల్స్ సాస్‌తో కలిపి తిన్నారా? అని వీడియోకు క్యాప్షన్ రాశారు.
When was the last time you had road side chinese hakka noodles with schezwan sauce? pic.twitter.com/wGYFfXO3L7
వీడియోకు కామెంట్లతో ఆ సెక్షనే నిండిపోయింది. నూడుల్స్ తయారీలో శుభ్రత మరిచరు? అసహ్యంగా ఉంది? ఆ ఫ్యాక్టరీకి వెంటనే మూసివేయాలని ఓ యూజర్ రాశారు. రోడ్డు మీద దొరికే ఆహార పదార్థాలు ఇలానే ఉంటాయని రాశారు. కంపెనీ బ్రాండ్ అయితే నీట్‌గా ఉంటాయని చెబుతున్నారు. పానీ పూరీ, సెవ్ పూరీ, శాండివిచ్ ఇలానే ఉంటాయని తెలిపారు. రోడ్డు మీద దొరికే శాండ్ విచ్ వాలాకు వెన్న ఎలా తయారవుతుందో ఆలోచించారా అని అడిగారు.