SRCL: చందుర్తి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గొట్టె ప్రభాకర్ కుమారుడు గొట్టె అనిరుద్ రచించిన “ది హ్యూమన్ ఆర్ట్” పుస్తకాన్ని వేములవాడలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. మూడు భాషల్లో రచించిన ఈ పుస్తకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనిరుద్ వృత్తి రీత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూనే తన ఖాళీ సమయాల్లో రచనా కొనసాగించారన్నారు.