దక్షిణాది సినీ పరిశ్రమలో నయనతార, సమంతలు స్టార్ హీరోయిన్లుగా ఒక వెలుగు వెలుగుతున్నారు. యంగ్ హీరోయిన్లకు పోటీనిస్తూ తమదైన శైలీలో మెప్పిస్తున్నారు. తాజాగా తన బెస్ట్ ఫ్రెండ్ సమంతకు నయనతార ఒక ప్రత్యేక బహుమతిని పంపించింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
Nayanthara: హీరోయిన్లకు ముందు చూపు చాలా ఎక్కువేనని చెప్పవచ్చు. అందుకే అందం ఉన్నన్ని రోజులు ఇండస్ట్రీ(Industry)లో సంపాదించుకుని తరువాత బిజినెస్‌లో పెట్టుబడులు పెడుతుంటారు. ఇదివరకే చాలా మంది కథనాయకలు వివిధ కంపెనీలలో పెట్టుబడులు పెట్టారు. తాజాగా ఈ లిస్ట్‌లో తమిళ లేడీ సూపర్‌స్టార్ నయనతార(Nayanathara) కూడా చేరింది. తానూ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది.
ఆమె బ్యూటీ రంగంలో ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగానే కాస్మొటిక్స్ బిజినెస్‌లో తన అదృష్టాన్ని పరిక్షించుకుంటుంది. 9 స్కిన్ పేరుతో బ్యూటీ ప్రాడక్ట్స్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా ఈ కంపెనీ నుంచి హీరోయిన్ సమంత(Samantha)కు కొన్ని ప్రాడక్ట్స్‌ను బహుమతిగా పంపింది. ఇది వరకే వీరిద్దరు మంచి స్నేహితులని టాక్ ఉంది. ఈ తరుణంలో ఈ వార్తకు ప్రాధాన్యత సంతరించుకుంది.
9 స్కిన్ ప్రాడక్ట్స్‌కు స్వయంగా నయతారే ప్రమోట్ చేస్తుంది. తన కంపెనీ నుంచి బెస్ట్ ఫ్రెండ్ సమంతకు కొన్ని ఫేస్ క్రీమ్ బ్యూటీ ప్రాడక్ట్స్తో పాటు ఒక విషింగ్ లెటర్ కూడా పెట్టింది. రిసీవ్ చేసుకున్న సమంత దాన్ని తన ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లో షేర్ చేసింది. ఈ ప్రాడక్ట్స్ ని వాడటానికి తాను ఆసక్తిగా ఉన్నానని తెలిపింది. 9 స్కిన్ కంపెనీకి ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఇది చూసిన నయన్ అభిమానులు కూడా కంగ్రాట్స్ చెబుతున్నారు.