SRCL: తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) రాష్ట్ర సహాయ కార్యదర్శిగా బుర్ర మల్లేశం గౌడ్‌ను నియమిస్తూ ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఉత్తర్వులు జారీ చేశారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్‌కు చెందిన మల్లేశం గౌడ్ ప్రజా పోరాటాల ద్వారా చేసిన సేవలను గుర్తించి రాష్ట్ర కార్యవర్గంలో ఆయనకు స్థానం కల్పించినట్లు అధ్యక్షులు వెల్లడించారు.