»Traffic Restrictions On These Routes In Adikmet Flyover Rob Hyderabad For 30 Days
Traffic restrictions: హైదరాబాద్లో ఈ రూట్లలో 30 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు!
హైదరాబాద్లో ట్రాఫిక్ జాం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రధాన రోడ్లపై ఏదైనా కార్యక్రమాలు లేదా మరమ్మత్తు పనులు జరిగితే ఆయా ప్రాంతాల్లో మరింత ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. ఈ నేపథ్యంలో అడిక్మెట్ ROB మరమ్మత్తు పనులు జరుగుతున్న క్రమంలో 30 రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.
Traffic restrictions on these routes in Adikmet flyover ROB Hyderabad for 30 days
హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో 30 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు(Traffic restrictions) ఉంటాయని ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. హైదరాబాద్ అడిక్మెట్ ROBకి(Adikmet flyover) మరమ్మత్తు పనులు జరగుతున్న నేపథ్యంలో అడిక్మెట్ బ్రిడ్జ్/ROB/ఫ్లైఓవర్” మూసివేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో 30 రోజుల పాటు ట్రాఫిక్ మళ్లించబడుతుందని అధికారులు పేర్కొన్నారు. అనగా అక్టోబర్ 12, 2023 నుంచి నవంబర్ 11, 2023 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు.
ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య విద్యానగర్ వై జంక్షన్ మీదుగా వచ్చే ఆర్టీసీ బస్సులు సహా భారీ వాహనాలు తార్నాక, హబ్సిగూడ, సికింద్రాబాద్, లాలాపేట్, ఈసీఐఎల్, నాచారం, మౌలాలి, విద్యానగర్ వై జంక్షన్ వైపు మళ్లిస్తారు. ఈ క్రమంలో NCC ఉస్మానియా యూనివర్సిటీ రోడ్లోకి అంటే అడిక్మెట్ ఫ్లైఓవర్/ROBపైకి వాహనాలు అనుమతించబడవు.
ఇక విద్యానగర్ ‘వై’ జంక్షన్ మీదుగా వచ్చే అన్ని ఎల్ఎంవీలు, తార్నాక లేదా చిలకలగూడ లేదా సికింద్రాబాద్ వైపు వెళ్లాలనుకునే అన్ని ఎల్ఎంవీలు రాంనగర్ టి జంక్షన్ వద్ద రాంనగర్ గుండు వైపు మళ్లిస్తారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య విద్యానగర్ ‘వై’ జంక్షన్-రామ్నగర్ టి జంక్షన్ నుంచి రాంనగర్ గుండు వైపు వచ్చే భారీ వాహనాలను రాంనగర్ గుండు నుంచి రాంనగర్ ఎక్స్ రోడ్డు వైపు మళ్లిస్తారు. భారీ వాహనాలను ఓయూ రోడ్డు లేదా లలిత నగర్ రోడ్డులోకి అనుమతించరు.
ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య తార్నాక జంక్షన్ మీదుగా వచ్చే ఆర్టీసీ బస్సులతో సహా భారీ వాహనాలు విద్యానగర్ – హిందీ మహావిద్యాలయం – శంకర్ మట్ – ఫీవర్ హాస్పిటల్ రోడ్డు వైపు వెళ్లాలంటే ఓయూ ‘వై’ జంక్షన్ వద్ద ఉస్మానియా యూనివర్శిటీ రోడ్డు – ఎన్సీసీ మీదుగా వెళ్లాలి. విద్యానగర్ రోడ్డు అంటే అడిక్మెట్ ఫ్లైఓవర్/ROBపైకి అనుమతి లేదు.
విద్యానగర్ – హిందీ మహావిద్యాలయం – శంకర్ మట్ – ఫీవర్ హాస్పిటల్ రోడ్డు వైపు వెళ్లేవి తార్నాక జంక్షన్ మీదుగా వచ్చే అన్ని ఎల్ఎమ్విలు రెండు, మూడు, నాలుగు చక్రాల వాహనాలు ప్రొఫెసర్ రామి రెడ్డి దూర విద్యా కేంద్రం వద్ద బౌద్ధనగర్ ఎక్స్ రోడ్ వైపు మళ్లించబడతాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య తార్నాక జంక్షన్ నుంచి వచ్చే భారీ వాహనాలను సీతఫల్మండి టి జంక్షన్ వద్ద ఆర్ఓబి సీతాఫల్మండి వైపు మళ్లిస్తారు. భారీ వాహనాలను వారాసిగూడ రోడ్డు వైపు అనుమతించరు. సీతఫల్మండి జంక్షన్ వద్ద చిలకలగూడ రోడ్డు వైపు మళ్లిస్తారు.